»   » గోపీచంద్ ‘సాహసం’ సెన్సార్ రిపోర్ట్

గోపీచంద్ ‘సాహసం’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై గోపీచంద్ హీరోగా, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన 'సాహసం' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసారు.

జులై 12న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాహసం మూవీ పీఆర్ఓ ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించారు. యజ్ఞం, రణం, లక్ష్యం, శౌర్యం వంటి చిత్రాలలో నటించిన గోపీచంద్..... ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ ఏలేటి తొలి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్ సమర్పణలో ఛత్రపతి ప్రసాద్ నిర్మించారు.

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా చంద్రశేఖర్ బాణీలో ఉంటూనే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందిందని, ఇంతవరకూ ఎవరూ షూటింగ్ చేయని ప్రదేశాలలో ఈ షూటింగ్ చేశామని, తమ సంస్థకు ఓ మంచి విజయవంతమైన చిత్రంగా మారే ఈ సినిమా గోపీచంద్‌కు ల్యాండ్‌మార్క్ మూవీగా ఉంటుందని నిర్మాతలు అంటున్నారు.

గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్. శక్తికపూర్, అలీతోపాటుగా ప్రముఖ తారాగణమంతా నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: శ్యామ్‌దత్ ఎస్, సంగీతం: శ్రీ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: సెల్వ, మాటలు: కె.కె.రాధాకృష్ణకుమార్, పాటలు: అనంత్‌శ్రీరామ్, సహ నిర్మాత: బోగవల్లి బాపినీడు, నిర్మాత: ఛత్రపతి ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటి.

English summary
Sahasam movie has cleared its censor formalities today and the movie awarded with "U/A" certificate from the Regional Censor Board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu