»   » ఇక్కడ దారుణం... కానీ అక్కడ కెరీర్ బిగ్గెస్ట్ హిట్.., పాపం నాగ చైతన్య అసలు పొరపాటేమిటి??

ఇక్కడ దారుణం... కానీ అక్కడ కెరీర్ బిగ్గెస్ట్ హిట్.., పాపం నాగ చైతన్య అసలు పొరపాటేమిటి??

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలా ఇబ్బందికర పరిస్థితుల మధ్య ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది 'సాహసం శ్వాసగా సాగిపో'. కానీ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. నాగచైతన్య చివరి సినిమా 'ప్రేమమ్' సూపర్ హిట్ అయిన నేపథ్యంలో 'సాహసం..'కు మంచి ఓపెనింగ్స్ రావాలి. పైగా చైతూ-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'ఏమాయ చేసావె' తెలుగు ప్రేక్షకులపై ఎలాంటి ముద్ర వేసిందో తెలిసిందే. కానీ చాలాసార్లు వాయిదా పడటం వల్ల కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ పడగా.. 500.. 1000 నోట్ల రద్దు ప్రభావం ఈ సినిమాపై బాగానే ప్రభావం చూపింది. తొలి రోజు కలెక్షన్లు ఏమంత ఆశాజనకంగా లేవు.

చాలాచోట్ల సినిమాకు హౌస్ ఫుల్స్ పడలేదు. ముఖ్యంగా ఆన్ లైన్ బుకింగ్స్ ఉండని బి-సి సెంటర్లలో 'సాహసం..'కు దెబ్బ గట్టిగానే తగిలేసింది. తెలుగులో ఓ మోస్త‌రుగా ఆడిన ఈ చిత్రం త‌మిళంలో మాత్రం మంచి వ‌సూళ్లే రాబ‌ట్టింది. ఐతే 'సాహసం..' తమిళ వెర్షన్ 'అచ్చం ఎన్బదు మదమాయిడ'కు మాత్రం టాక్ తో పాటు కలెక్షన్లు కూడా బాగున్నాయి. తొలి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్లతో అదరగొట్టింది ఈ సినిమా. శింబుకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉండటం.. చాన్నాళ్ల తర్వాత అతడి సినిమా రిలీజవుతుండటం.. అంచనాలు కూడా భారీగా ఉండటంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. తెలుగుతో పోలిస్తే తమిళ వెర్షన్ కు ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలన్నీ కూడా ఫుల్ పాజిటివ్ గానే వచ్చాయి. అక్కడ కూడా 500.. 1000 నోట్ల రద్దు ప్రభావం ఉన్నా.. సినిమా తొలి రోజు హౌస్ ఫుల్స్ తో ఆడింది.


Sahasam Swaasaga Saagipo Tamil Version collects 80 Crores Gross

కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ లో నడిచింది తెలుగులో యావరేజ్ రివ్యూలకు తోడు.. పెద్ద నోట్ల రద్దు ప్రభావం బాగా పడి.. 'సాహసం శ్వాసగా సాగిపో' దెబ్బ తింది. ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ లేవు. ఆ తర్వాత కూడా కలెక్షన్లు అంతంతమాత్రమే. గ్రాస్ కలెక్షన్లు కూడా పది కోట్ల మార్కును దాటాయంతే. కానీ తమిళంలో మాత్రం ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధించింది. డీమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉన్నా అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.80 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని చిత్ర వర్గాలే అధికారికంగా ప్రకటించాయి. ఐదో వారంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ రన్ కొనసాగుతుండటం విశేషం. ఒకచోట ఫ్లాప్ అయిన సినిమా.. మరో చోట ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అనూహ్యమే.

English summary
aftor a big Hit "Premam" Akkineni naga chaithanya starer Sahasam Swaasaga Saagipo movie Becam a flop at Box offece But Tamil Version of this movie collects 80 Crores Gross
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu