»   » గెలుపంటే ఇదీ అంటూ పవన్ కళ్యాణ్ మామ చెప్పాడు: సాయి ధరమ్ తేజ్

గెలుపంటే ఇదీ అంటూ పవన్ కళ్యాణ్ మామ చెప్పాడు: సాయి ధరమ్ తేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాహీరో సాయిధరమ్‌ తేజ్ నటించిన తాజాగా విన్నర్‌. ఈ మూవీకి సంబంధించిన పాటలు ప్రస్తుతం వరుసగా రిలీజ్ అవుతున్నాయి. షూటింగ్ తో సహా అన్ని పనులు పూర్తి చేసుకున్న విన్నర్‌...ఆడియో రిలీజ్ ని వైవిధ్యంగా జరుపుకుంటూ వస్తుంది. ఒక్కోపాటని ఒక్కో సెలబ్రిటీతో రిలీజ్ చేయించటం కారణంగా ఈ మూవీకి కావాల్సినంత ప్రమోషన్ వస్తుంది.

ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఏ మూవీకి చేయనివిధంగా విన్నర్ మూవీకి ప్రత్యేకమైన ప్రమోషన్స్ ని చిత్రయూనిట్ చేపడుతుంది. ఇలా అన్నీ సాంగ్స్ ని రిలీజ్ చేసిన తరువాత విన్నర్ మూవీకి ఆడియో ఫంక్షన్ ఉంటుందా ఉండదా అన్న అనుమానం నిన్నటితో తీరిపోయింది. ప్రస్తుతం ట్రెండ్ గా మారిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నే సాయి ధరమ్‌ తేజ్‌ సైతం ఫాలో అయిపోయాడు.

Sai Dharam Remember Pawan at Winner Pre Release Event

అయితే ఈసారి కూడా ఎప్పటిలాగానే అందరినీ వేదించిన ప్రశ్న ఒక్కటే, ఫంక్షన్‌కు పవన్‌కల్యాణ్‌ వస్తున్నాడా? అనేదే. అయితే సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లకు దూరంగా ఉండే పవన్‌.. తన మనసుకు నచ్చిన వారి సినిమా ఫంక్షన్లకు మాత్రం హాజరవుతాడు. నితిన్‌, సప్తగిరి వంటివారి ఆడియో ఫంక్షన్లకు పవన్‌ హాజరైన విషయం తెలిసిందే కదా అంతే కాక పవన్ వస్తున్నాడు అంటూ అంటూ ముందే ఒక టాక్ కూడా వచ్చింది దాంతో అభిమానులూ పవన్ వస్తున్నాడనే అనుకున్నారు. కానీ ఎప్పటి మాదిరే ఈసారి కూడా పవన్ హ్యాండ్ ఇచ్చాడు. పవర్ స్టార్ రాకకొసం ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది.

అయితే ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏమిటంటే మావయ్యలిద్దరినీ సాయిధరమ్‌ ఆహ్వానించాడని సమాచారం. అయితే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌తో బిజీగా ఉన్న చిరు.. ఫంక్షన్‌కు హాజరుకాలేనని ముందుగానే చెప్పేశాడట. అమెరికా నుంచి తిరిగి వచ్చిన పవన్‌ మాత్రం ఆ ఫంక్షన్‌కు వస్తానని చెప్పాడట. దీంతో పవన్‌ వస్తాడని తేజు చివరివరకు ఆశతోనే ఉన్నాడు. అయితే పవన్‌కు కుదరలేదు. మంగళగిరి చేనేత సదస్సు ఏర్పాట్లలో బిజీగా ఉండడం వల్లే ఈ ఫంక్షన్‌కు పవన్‌ రాలేకపోయినట్టు తెలుస్తోంది.

Sai Dharam Remember Pawan at Winner Pre Release Event

అయితే ధరమ్‌తేజ్ మాత్రం మామయ్య రాలేకపోయినా పట్టించుకోకుండా పవర్ స్టార్ ని గుర్తు చేసుకున్నాడు... ''మాటీవీ అవార్డుకు ఎంపికయ్యానని పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి చెప్పాను. దానికాయన ఒకటే చెప్పారు. అవార్డులు గెలవడం.. విజయాలు సాధించడం కాదు.. ఒక ఫెయిల్యూర్ వచ్చినపుడు మన చుట్టూ ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి మనం గెలిచామా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది" అన్నాడు. ఆ విషయం నాకు 'తిక్క' సినిమా తర్వాత అర్థమైంది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా సరే.. నా శ్రేయోభిలాషులు.. మెగా అభిమానులు అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా" అంటూ చెప్పాడు .

English summary
At the pre-release event of 'Winner', Sai Dharam Tej revealed how his uncle Pawan Kalyan made him realize the true definition of victory.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu