Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్‌కు శుభవార్త.. క్షేమంగా ఉన్నారంటూ నిర్మాత అల్లు అరవింద్
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడటం మెగా అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అభిమానుల్లో ఆందోళనలో ఉండటంతో నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడి సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై వివరాలు వెల్లడించారు. మీడియాతో అల్లు అరవింద్‌తో మాట్లాడుతూ..

ఈ రోజు (సెప్టెంబర్ 10) రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదం లేదు. చాలా క్షేమంగా ఉన్నాడు. నేను వైద్యులతో మాట్లాడి తర్వాత మీకు ఈ మాట చెబుతున్నాను. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో కంగారు అవసరం లేదు. తలకు గానీ.. శరీరంలో మారెక్కడా ఇంటర్నల్ బ్లీడింగ్ లేవని వైద్యులు తెలిపారు. రేపు ఉదయం జనరల్ వార్డుకు తీసుకొస్తారని.. సాధారణంగా ఆయన మాట్లాడతాడని వైద్యులు నాతో చెప్పారు అని అల్లు అరవింద్ చెప్పారు.
మీడియాలో ఏవేవో వార్తలు రాకుండా ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చి చెప్పాలి కాబట్టి.. నేను చెప్తున్నాను. మళ్లీ చెప్తున్నాను సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడు.. తలకు గానీ, వెన్నముక ప్రాంతంలో గానీ గాయాలు కాలేదు. ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉంది అని అపోలో దగ్గర మీడియాతో అల్లు అరవింద్ తెలిపారు మీకు డాక్టర్ల హెల్త్ బులిటెన్ కావాలంటే ఇంకో అరగంటలో వస్తుంది అని అల్లు అరవింద్ చెప్పారు.
మీడియాతో అల్లు అరవింద్ మాట్లాడిన తర్వాత అపోలో హాస్పిటల్ వైద్యులు మీడియాకు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై సమాచారం అందించారు. తేజ్ ఆరోగ్యంపై అపోలో వైద్యులు రాత్రి 12 గంటల ప్రాంతంలో బులెటిన్ రిలీజ్ చేశారు. సాయిధరమ్ తేజ్‌కు న్యూరోసర్జన్ డాక్టర్ అలోక్ రంజాన్, క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి, పాలమనాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రవీణ్ హరనాథ్, ఆర్థోపెడిక్స్ డాక్టర్ బాలవర్ధన్ రెడ్డితో కూడిన బృందం సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే హాస్పిటల్‌కు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వరుణ్ తేజ్, సుస్మిత కొణిదెల, చిరంజీవి, పంజా వైష్ణవ్ తేజ్, సందీప్ కిషన్ తదితరులు హాస్పిటల్‌కు వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.
సాయిధరమ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రిపబ్లిక్ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో అవినీతిపై పోరాటం చేసే అధికారి పాత్రలో ప్రేక్షకుల మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











