»   » గర్ల్‌ఫ్రెండ్ మాట్లాడటం లేదు.. ఆమె చాలా క్లోజ్.. సాయి ధరమ్

గర్ల్‌ఫ్రెండ్ మాట్లాడటం లేదు.. ఆమె చాలా క్లోజ్.. సాయి ధరమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో మెగా క్యాంపు నుంచి స్వయంకృషితో దూసుకెస్తున్న యువ కెరటం సాయి ధరమ్ తేజ్ 'విన్నర్‌'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో జాకీగా నటిస్తున్నాడు. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా గుర్రపు స్వారీ శిక్షణ తీసుకొన్నాడు. హార్స్ రైడింగ్‌కు సంబంధించిన సన్నివేశాలను ఇటీవల టర్కీలో పూర్తి చేసుకొన్నారు. ఈ చిత్రంలో తనలో ప్రతిభను బయటకు తీసిన దర్శకుడు మలినేని గోపిచంద్‌పై సాయి ధరమ్ ప్రశంసించాడు. ఈ చిత్రంలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్‌తో ఉన్న రిలేషన్‌పై వివరణ ఇచ్చాడు.

రకుల్, నేను క్లోజ్

రకుల్, నేను క్లోజ్

‘రకుల్ ప్రీత్ సింగ్‌తో చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. మేమిద్దరం ఒకేసారి కెరీర్ ప్రారంభించాం. సందీప్, రాశీ ఖన్నా, రెజీనా, నవీన్ అంతా కలిసి పార్టీలు చేసుకొంటాం' అని సాయి ధరమ్ తేజ్ అన్నాడు. ఆహారం, ఆలోచన విషయంలో మా ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయని ఆయన చెప్పాడు.


అఫైర్ ఉంటే చెప్తాను..

అఫైర్ ఉంటే చెప్తాను..

‘నేను బ్రహ్మచారిని. నా తోటి నటులతో చాలా స్నేహంగా ఉంటాను. ఒకవేళ అఫైర్ ఉంటే చెప్పుకోవడానికి నాకేం సమస్యలేదు' అని సాయి అన్నాడు. ప్రతీ హీరోయిన్‌తో సంబంధాన్ని లింక్ పెట్టడం సరికాదన్నారు. అలాంటి మాటలు విన్నప్పుడు నవ్వి ఊరుకొంటానని తెలిపారు అని వెల్లడించాడు. ప్రస్తుతం ఏ హీరోయిన్ తో గానీ అఫైర్ లేదని స్పష్టం చేశాడు.


అమ్మ, బ్రదర్, నవీన్ మంచి క్రిటిక్స్

అమ్మ, బ్రదర్, నవీన్ మంచి క్రిటిక్స్

‘సినీ తారలతో రూమర్ల కారణంగా కాలేజీ గర్ల్‌ఫ్రెండ్ మాట్లాడటం మానేసింది. నా గురించి మా అమ్మకు బాగా తెలుసు. సినీ జీవితంలో ఇలాంటి కామన్. నేను నటించే సినిమాల గురించి తన తల్లి, సోదరుడు, స్నేహితుడు నరేష్ కుమారుడు నవీన్ బాగా చెప్తారు' అని సాయి తెలిపాడు.


నవీన్ మంచి స్నేహితుడు

నవీన్ మంచి స్నేహితుడు

హీరో నరేశ్ కుమారుడు నవీన్ అన్ని సమయాల్లోనూ తోడుంటాడని, ఒకవేళ ఏదైనా కథ నాకు నచ్చితే వాడి అభిప్రాయం తీసుకొంటాను అని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. విజయం లభించినపుడు తలకు ఎక్కించుకోవద్దని, పరాజయం పొందితే గుణపాఠంగా తీసుకోవాలని తన తల్లి ఎప్పుడు చెబుతుందని ఆయన పేర్కొన్నాడు.


గుర్రపు స్వారీ కోసం ప్రత్యేక శిక్షణ

గుర్రపు స్వారీ కోసం ప్రత్యేక శిక్షణ

గుర్రపు స్వారీ సన్నివేశాల చిత్రీకరణ కోసం టర్కీలో ప్రముఖ స్టంట్ మాస్టర్ కలోయియాన్‌ సహకారం తీసుకొన్నారు. ఈయన మిషన్ ఇంపాజిబుల్, రోగ్ నేషన్, ట్రాయ్ అండ్ వరల్డ్ వార్ జెడ్ అనే చిత్రాలకు పనిచేశాడు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం చాలా అనుభవం ఉన్న గుర్రాలను ఉపయోగించుకొన్నామని సాయి తెలిపాడు.


విడిచి వచ్చేటప్పుడు కన్నీళ్లు

విడిచి వచ్చేటప్పుడు కన్నీళ్లు

విన్నర్ చిత్రం కోసం ఉపయోగించిన గుర్రాలు డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే పరిగెత్తేవని. కట్ అని చెప్పగానే పరుగెత్తడం ఆపేవని సాయి ధరమ్ తేజ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. షూటింగ్ సమయంలో తోరా అనే గుర్రంతో మంచి చనువు ఏర్పడింది. ఒకసారి కిందపడగానే తోరా పరుగెత్తడం ఆపివేసిందని, దాంతో ప్రమాదం నుంచి బయటపడ్డానని ఆయన తెలిపాడు. టర్కీ నుంచి బయలుదేరేటప్పుడు తోరాను విడిచి రావడం వల్ల కళ్లలో నీళ్లు తిరిగాయని సాయి చెప్పాడు. విన్నర్ చిత్రం మార్చి 24న విడుదలకు సిద్ధమవుతున్నది.


English summary
Sai Dharam tej said, I’ve known Rakul Preet since a long time. I just want to clarify that I am single and friendly with all my co-stars. because of these rumours, his college girlfriend didn’t talk to him.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu