»   » ప్లాప్ డైరెక్టర్‌తో జతకడుతున్న మెగా ఫ్యామిలీ హీరో

ప్లాప్ డైరెక్టర్‌తో జతకడుతున్న మెగా ఫ్యామిలీ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కళ్యాణ్ రామ్ హీరోగా ‘ఓం' అనే 3డి ఫిల్మ్ తెరకెక్కించిన దర్శకుడు సునీల్ రెడ్డికి ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. చాలా కాలం తర్వాత సునీల్ రెడ్డికి మెగా ఆఫర్ దక్కింది. అతనితో సినిమా చేయడానికి మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పాడు.

సాయి ధరమ్ తేజ్‌తో యాక్షన్ ఫిల్మ్ చేసేందుకు సునీల్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పనిచేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

Sai Dharam Tej

టెక్నికల్ అంశాలపై బాగా అవగాహన ఉన్న దర్శకుడిగా సునీల్ రెడ్డికి మంచి పేరుంది. సాయి ధరమ్ తేజతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇందు కోసం పక్కాగా స్క్రిప్టు వర్క్ చేసి రంగంలోకి దిగుతున్నాడట. త్వరలో సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్..
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిధరమ్‌తేజ్‌, రెజినా, అదాశర్మ, సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావురమేష్‌, పృథ్వి, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, వెంకట్‌, ఆర్ట్‌: రామకృష్ణ, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, సతీష్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, కో`ప్రొడ్యూసర్స్‌: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌ ఎస్‌.

English summary
Sai Dharam Tej, the young Mega hero has signed yet another big film in the direction of Sunil Reddy of Kalyanram’s OM fame.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu