»   » సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ మూవీకి అందమైన టైటిల్

సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ మూవీకి అందమైన టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్ నుంచి వస్తున్న 45వ సినిమా ఇది.

రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'అందమైన చందమామ' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయమై త్వరలో అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.

Sai Dharam Tej next movie title Andamaina Chandamama

ఇందులో సాయాధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిప్రేమ, డార్లింగ్‌ వంటి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించి సెన్సిబుల్‌ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకున్న ఎ.కరుణాకరన్‌ ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌ను సరికొత్తగా చూపిస్తారని భావిస్తున్నారు.

ఈ చిత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌ కలిసిన యూత్‌ఫుల్‌ కలర్‌ఫుల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిస్తున్నామని కరుణాకరన్ వెల్లడించారు. సాయిధరమ్‌తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌, సురేఖావాణి, వైవా హర్ష, జోష్‌ రవి, ఐశ్వర్య, రాజా, భరత్‌రెడ్డి, కార్తీక్‌, అభిషేక్‌ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Sai Dharam Tej will be seen as a lover boy in his upcoming film which is being directed by Karunakaran. Film Nagar source said that, the team has locked Andamaina Chandamama as the film's title.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X