For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాక్షన్, ప్రేమ ల సంగమం ('పిల్లా నువ్వు లేని జీవితం' ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ లాంచింగ్ కోసం ఇండస్ట్రీ, మెగాభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ,రేపు అంటూ వాయిదాలు వేసుకుంటూ మెదట విడుదలనుకున్న రేయ్ చిత్రం ఆర్దిక కారణాలతో వెనక్కి వెళ్లిపోయింది. రెండో చిత్రం గా చేసిన ఈ సినిమా మొదటి సినిమాగా ఈ రోజు విడుదల అవుతోంది. ఇప్పటికే టీజర్స్ ద్వారా సాయిధరమ్ తేజ లో మంచి ఈజ్ ఉన్న ఆర్టిస్టు ఉన్నాడని ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాతో హిట్ వస్తే కెరిర్ పరుగెడుతుంది.

  'ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదు అనుకునే కుర్రాడి కథ ఇది. సాయిధరమ్‌తేజ్‌ నటన, రెజీనా అందం ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ప్రేమించి అమ్మాయి ని పొందటం కోసం ఆమెకు పొంచి ఉన్న సమస్య పై ఎలా పోరాడాడు అనేది స్క్రీన్ ప్లే తో సాగే కథాశం.

  నిర్మాతలు మాట్లాడుతూ... జగపతిబాబు తమ సినిమాలోకి రావడంతో భారీ అంచనాలు వచ్చాయని, మంచి కథకు వైవిధ్యమైన కమర్షియల్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు సినిమాను రూపొందిస్తున్నరని చేస్తున్నామని తెలిపారు.

  దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ...''ఏం పిల్లో.. తరవాత కొంత విరామం తీసుకొన్నా. కాకపోతే చాలా కథలు రాసుకొన్నా. నేను బతకడానికైతే విరామం లేకుండా సినిమాలు చేసేవాడిని. కానీ నా స్నేహితులు మంచి కథతో సినిమా తీయమని సూచించారు. అందుకే ఈ ఆలస్యం. మొదటి దిల్ రాజు గారికి కథ చెప్పాను. ఆయన నచ్చి అరవింద్ గారి దగ్గరకి తీసుకు వెళ్లారు. ఆయనకు కూడా నచ్చి వెంటనే ఓకే అన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలతో చేసే అవకాసం రావటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. '' అన్నారు.

  సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... ఇది నా రెండో సినిమా ఈ సినిమాకు కళ్యాణ్ మామయ్య నటించిన గబ్బర్ సింగ్ లో విజయవంతం అయిన పిల్లా నువ్వు లేని జీవితం అనే పాట పల్లవిని టైటిల్ గా పెట్టడం సంతోషంగా ఉంది. ఇంత మంచి టీమ్ తో పనిచేయడం ఆనందంగా ఉంది అన్నారు.

  దిల్‌రాజు మాట్లాడుతూ- బన్నీకి మా బ్యానర్‌లో ఆర్య, పరుగు చిత్రాలు పెద్ద హిట్‌గా నిలిచాయి. అలాగే సాయిధరమ్‌కు కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. దిల్ టైమ్‌నుంచి అనూప్‌తో మంచి పరిచయం ఉంది. అతనితో ఎప్పుడో సినిమా చేయాలి. కానీ కుదరలేదు. ఈ సినిమాకి అనూప్ అందించిన మ్యూజిక్ పెద్ద హిట్‌గా నిలిచింది అన్నారు.

  Sai Dharam Tej’s debut 'Pilla Nuvvu Leni Jeevitham' preview

  బ్యానర్: గీతాఆర్ట్స్

  నటీనటులు: సాయిధరమ్‌తేజ్‌, రెజీనా, జగపతిబాబు, చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు సంగీతం:అనూప్ రూబెన్స్,

  పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ,

  కెమెరా: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు,

  మాటలు:డైమండ్ రత్నం, వేమారెడ్డి,

  నిర్మాతలు: బన్నివాసు, హర్షిత్,

  కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

  విడుదల తేదీ: 14, నవంబర్ 2014.

  English summary
  Sai Dharam Tej’s debut film, 'Pilla Nuvvu Leni Jeevitham', which is supposed to be his second, is releasing today (November 14th). Sai Dharam Tej and Regina Cassandra are the lead pair in this film, which is directed by 'Yagnam' fame A.S.Ravikumar Chowdary.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X