»   » గెస్ట్ పాత్రలో సాయి ధరమ్ తేజ, ఫ్రెండ్ షిప్ కోసం

గెస్ట్ పాత్రలో సాయి ధరమ్ తేజ, ఫ్రెండ్ షిప్ కోసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ త్వరలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. అదీ పోలీస్ పాత్రలో. రీసెంట్ గా వచ్చిన 'సుప్రీమ్'లో లేడీ పోలీసాఫీసర్‌తో ప్రేమలో పడిన యువకుడిగా కనిపించిన సాయిధరమ్ తేజ్ ....ఆ సినిమాలో హీరోయిన్‌ని ప్రేమలో పడేయడానికి సరదాగా ఓసారి ఖాకీ చొక్కా వేసుకున్నారు. ఇప్పుడు మాత్రం నిజమైన పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు.

కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్, కాజల్ అగర్వాల్, రెజీనా నటీనటులుగా రూపొందుతున్న సినిమా 'నక్షత్రం'. ఇందులో సాయిధరమ్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఇది గెస్ట్ రోల్ అనమాట. త్వరలో షూటింగ్‌లో పాల్గొననున్నారు. హీరో సందీప్ కిషన్ ఈ విషయం ట్వీట్ ద్వారా తెలియజేశారు.

చిత్రం వివరాలకు వస్తే... క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ .... 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం తర్వాత సైలెంట్‌గా ఉన్నారు. ఆయన కొత్త చిత్రాల గురించి రకరకాల వార్తలు హల్‌చెల్‌ చేశాయి. బాలకృష్ణ వందవ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తారని ఊహాగానాలు వచ్చాయి.

Sai Dharam Tej's guest role in Krishnavamsi's Nakshatram

ఇంకా అనుష్క హీరోయిన్ గా దిల్‌ రాజు సినిమా చేస్తారని కూడా వినిపించింది. సూపర్‌హిట్‌ సినిమా 'ఖడ్గం' సినిమాకు కొనసాగింపుగా పార్ట్‌ 2 తీస్తారని ప్రచారం జరిగింది. కానీ, చివరగా సందీప్‌ కిషన్‌తో కొత్త చిత్రం చేస్తున్నారు.

సాధారణంగా కృష్ణవంశీ సినిమా అనగానే ప్రేక్షకులు ఎంతో ఆశిస్తారు. రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాల కోవలో ఆయన సినిమాలు ఉండవు. అందుకే వంశీ దర్శకత్వంలో నటించడానికి హీరోలు ఉత్సాహం చూపిస్తారు. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ నటించే చిత్రానికి 'నక్షత్రం' అని టైటిల్‌ నిర్ణయించారు.

శ్రీ చక్ర మీడియా సారథ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్‌ పాతెకంపై కే. శ్రీనివాసులు, విన్‌ విన్‌ విన్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాతలు ఎస్‌. వేణుగోపాల్‌, సజ్జు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోలీస్‌ కావాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథతో 'నక్షత్రం' సినిమా తీస్తున్నట్టు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు.

English summary
Sai Dharam Tej has readily agreed to play a guest role in the director Krishnavamsi's Nakshatram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu