»   » స్టైలిష్ లుక్: మెగా హీరో....సాంగ్ లీకైంది

స్టైలిష్ లుక్: మెగా హీరో....సాంగ్ లీకైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి కొత్తగా వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. తొలి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం'తో మంచి ఇంప్రెషన్ కొట్టేసాడు కూడా. మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంది పుచ్చుకున్నాడంటూ సాయి ధరమ్ తేజ్ మీద ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి.

ప్రస్తుతం సాయి ధమర్ తేజ్ చేస్తున్న సినిమా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది కూడా. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగు ఒకటి ఇంటర్నెట్లో లీక్ అయి వైరల్ లా వ్యాపించింది.

Sai Dharam Tej's Subramanyam For Sale Video Song Going Viral

ఆ సాంగుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడని స్పష్టమవుతోంది. ఈ మధ్య కాలంలో పరాజయాలు చవి చూసిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా కోసం కసిగా పని చేస్తున్నాడు.

సాయిధరమ్‌తేజ్‌, రెజినా, అదాశర్మ, సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావురమేష్‌, పృథ్వి, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, వెంకట్‌, ఆర్ట్‌: రామకృష్ణ, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, సతీష్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, కో`ప్రొడ్యూసర్స్‌: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌ ఎస్‌.

English summary
Sai Dharam Tej, who scored some brownie points with his debut film, Pilla Nuvvu Leni Jeevitham, is working hard to keep up the Mega hero tag to make his uncles, Chiranjeevi and Pawan Kalyan proud. While his upcoming film with Harish Shankar, Subramanyam For Sale, already earned good buzz with a simple teaser released on Ugadi, its newly released song shoot video is going viral on social networking sites.
Please Wait while comments are loading...