»   » సాయిధరమ్‌తేజ్‌ 'తిక్క' ఫస్ట్‌లుక్‌ విడుదల

సాయిధరమ్‌తేజ్‌ 'తిక్క' ఫస్ట్‌లుక్‌ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌ పతాకంపై సాయిధరమ్‌తేజ్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న కొత్త చిత్రం 'తిక్క' ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. సాయిధరమ్‌తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సి. రోహిణ్‌ కుమార్‌ రెడ్డి నిర్మాత. థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ...‘‘ఇందులో నా పేరు ఆదిత్య. ఈ చిత్రంలో నేను ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే పాత్రలో నటిస్తాను. హీరోయిన్‌తో ప్రేమలో పడిన తర్వాత కొన్ని కారణాలతో వారి మధ్య గొడవలు వస్తాయి. దాంతో హీరోకి తిక్కరేగుతుంది. అందుకే ఈ సినిమాకి ‘తిక్క' అనే టైటిల్‌‌ను పెట్టారు. చివరికి హీరో హీరోయిన్ ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేదే సినిమా కథ'' అన్నారు.

Sai Dharam Tej's Thikka movie first look

దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ...‘‘ ఎవరి లైఫ్‌కి వారే హీరో. కానీ ఈ సినిమాలో హీరో లైఫ్‌కి హీరోనే విలన్. ఇదో ఫన్ గోయింగ్ మూవీ. రాజేంద్ర ప్రసాద్ హీరో ఫాదర్‌గా నటిస్తుండగా...రావు రమేష్ హీరోయిన్ ఫాదర్‌గా నటిస్తున్నారు. డిసెంబర్‌కి షూటింగ్‌ను పూర్తి చేసి ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చేయడాని ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

నిర్మాత సి.రోహిణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...‘‘ ఈ స్టోరీ వినగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నిర్మాతగా నా తొలి సినిమా ఇది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, ఆలీ, తాగుబోతు రమేష్, అజయ్, వెన్నెల కిషోర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
First look poster of Supreme Hero Sai Dharam Tej's upcoming movie THIKKA ,Which has been released on the occasion of Sai Dharam Tej's Birthday.
Please Wait while comments are loading...