»   » బర్త్ డే స్పెషల్: సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ ఫస్ట్ లుక్ పోస్టర్

బర్త్ డే స్పెషల్: సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్‌ తేజ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది సాయి ధరమ్ తేజ్ నటించిన 'సుప్రీమ్', 'తిక్క' చిత్రాలు రిలీజ్ అయ్యాయి. సుప్రీమ్ మూవీ మంచి విజయం సాధించగా... తిక్క బాక్సాఫీసు వద్ద పెద్ద ప్లాప్ అయింది.

Sai Dharam Tej's Winner first look poster

త్వరలో సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కలిసి లక్ష్మీ నరసింమా ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు.

నేడు (అక్టోబర్ 15) సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అపీషియల్ గా రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

English summary
Mega Supreme Hero Sai Dharam Tej's 'Winner' first look released by the movie makers on the occasion of Sai Dharam Tej's Birthday today. The movie directed by Gopichand Malineni. Actress Rakul Preet Singh plays the female lead role.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu