twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ మామ ఏమన్నారంటే, తిట్లు తినేవాడు, వాళ్లకు సమాధానం చెప్పాలనే భయం

    సాయిధరమ్ తేజ, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా నటిస్తున్న విన్నర్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఘనంగా జరిగింది.

    By Srikanya
    |

    హైదరాబాద్ : సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'విన్నర్‌'. సాయిధరమ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సింగం 3 ఫేం థాకూర్ అనూప్ సింగ్ విలన్ గా నటిస్తున్నాడు. జగపతిబాబు, ముఖేష్ రుషి, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్ కు రెడీ అవుతోంది.

    గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. మాస్ యాక్షన్ తో పాటు కామెడీ పంచ్ లతో కట్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. చిత్రం రిలీజ్ సమయం దగ్గర పడటంతో చిత్రానికి మరింత క్రేజ్ పెంచటానికి ప్రీ రిలీజ్ ఈ వెంట్ ని నిర్వహించారు. ఆ ఈవెంట్ విశేషాలను మీకు ఈ క్రింద అందిస్తున్నాం.

    ఇప్పటి వరకు మీడియం బడ్జెట్ సినిమాలతో మంచి కమర్షియల్ హిట్స్ అందుకున్న సాయి ఈ సారి మాత్రం రిస్క్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. విన్నర్ సినిమాను సాయి ధరమ్ గత సినిమాలతో పోలిస్తే భారీ బడ్జెట్ తో రూపొందించారు.

    హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్, విలన్ గా జగపతిబాబు లాంటి టాప్ స్టార్స్ తో పాటు భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్ కే 11 కోట్ల వరకు అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఫారిన్ షూట్ లు, హార్స్ రేసింగ్ సీన్లతో కలిపి బడ్జెట్ 24 కోట్లకు చేరిందని చెప్తున్నారు. వాటి గురించి సాయి ధరమ్ తేజ ఏమన్నారో కూడా క్రింద చూద్దాం.

    హీరో మార్కెట్ ఆలోచించలేదు

    హీరో మార్కెట్ ఆలోచించలేదు

    'విన్నర్‌' కథ విన్న వెంటనే ఖర్చుతో కూడుకున్న సినిమా. నా మీద అంత బడ్జెట్‌ అవసరమా? అనుకున్నా. కానీ, నిర్మాతలు కథకు తగ్గట్టు ఖర్చు పెట్టాలని ఆలోచించారు తప్ప హీరోకి మార్కెట్‌ గురించి ఆలోచించలేదు. వాళ్లు పెట్టిన ఖర్చుకి, గట్స్‌కి సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నా'' అన్నారు సాయిధరమ్‌ తేజ్‌.

    వస్తూంటాయి..పోతూంటాయి

    వస్తూంటాయి..పోతూంటాయి

    సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ- ''అవార్డులు, రివార్డులు వస్తుంటాయ్, పోతుంటాయ్‌.
    కానీ, ఓటమి వచ్చినప్పుడు నీ చుట్టూ ఎవరుంటారన్నదే ఇంపార్టెంట్‌ అని కల్యాణ్‌గారు (పవన్‌ కల్యాణ్‌) చెప్పారు. ఈ రెండేళ్లు ఏం గెలుచుకున్నావంటే మెగా ఫ్యాన్స్‌ అభిమానం గెలుచుకున్నాను. నాకు గెలుపు, ఓటమిని పరిచయం చేసిన అమ్మా.. 'లవ్‌ యూ'' అన్నారు.

    కళ్యాణ్ మామ ఏమన్నారంటే..

    కళ్యాణ్ మామ ఏమన్నారంటే..

    ‘‘అవార్డు గెలిచానని ఓ సందర్భంలో కల్యాణ్‌ మామకి చెప్పా. అసలు గెలుపంటే ఏంటో అప్పుడు చెప్పారు మామ. నీకు ఓటమి ఎదురైనప్పుడు ఎవరైతే నీ చుట్టూ ఉంటారో అప్పుడు తెలుస్తుంది... నీవు ఏం గెలిచావో అని! ఇంతకుముందు నా సినిమా పరాజయాన్ని చవిచూసినా అభిమానులు అండగా నిలిచారు. అందుకే ఈ ప్రయాణంలో నేను ఏం గెలుచుకొన్నానని అది అభిమానుల్ని అనే చెబుతా'' అన్నారు సాయిధరమ్‌ తేజ్‌.

    ఛోటా మామతో పనిచేయటం...

    ఛోటా మామతో పనిచేయటం...

    ‘‘నాకు గెలుపోటముల్ని పరిచయం చేసిన మా అమ్మ, పిన్నికి కృతజ్ఞతలు. ఈ కథ చెప్పగానే అమ్మ చిన్నప్పుడు చెప్పిన కథలు గుర్తుకొచ్చాయి. మార్కెట్‌ గురించి ఆలోచించకుండా కథకు ఏదైతే అవసరమో అది పెట్టారు నిర్మాతలు. గోపీచంద్‌ మలినేని అన్న నుంచి చాలా నేర్చుకొన్నా. ఛోటా మామతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆయన చూపించే ప్రేమ నన్ను కదిలిస్తుంటుంది. గోపీ, ఛోటా మామ నన్ను జాగ్రత్తగా చూసుకొంటూ ఈ సినిమా చేయించారు. తమన్‌ నా స్నేహితుడు. మంచి పాటలు అందించాడు. మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. రకుల్‌, నేను స్నేహితులం'' అన్నారు సాయి.

    ఆయనే నేర్పాలు

    ఆయనే నేర్పాలు

    రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘గోపీచంద్‌ మలినేనితో ఇది నాకు రెండో సినిమా. మరింత సులభంగా పనిచేశా. ఛోటా కె.నాయుడుగారితో నా తొలి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' నుంచి నా ప్రయాణం సాగుతోంది. సెట్‌లో క్రమశిక్షణగా ఎలా మెలగాలో ఆయనే నాకు నేర్పారు. నిర్మాతలు మంచి విలువలతో చిత్రాన్ని నిర్మించారు. తమన్‌ ఈ సినిమాలో పాటలో పాటల్ని ఇరగదీశాడు. '' అన్నారు.

    పెద్ద కుటుంబం నుంచి వచ్చినా

    పెద్ద కుటుంబం నుంచి వచ్చినా

    రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కంటిన్యూ చేస్తూ.. ‘‘నేను కలిసినవాళ్లలో ఒక ఉత్తమమైన వ్యక్తి సాయిధరమ్‌ తేజ్‌. చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినా చాలా కష్టపడతాడు, ఎంతో ఒదిగి ఉంటాడు. తనతో కలిసి పనిచేయడం మంచి అనుభూతి. ఒక తెలుగమ్మాయిగా నన్ను ప్రోత్సహించారు ప్రేక్షకులు. ఈ సినిమాతో మరోసారి అందరినీ అలరిస్తా'' అన్నారు.

    ఆ డెడికేషన్ చూసా

    ఆ డెడికేషన్ చూసా

    గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ- ''తేజూను మానిటర్‌లో చూస్తున్నప్పుడు చిరు, పవన్‌లను డైరెక్ట్‌ చేస్తున్నట్టనిపించింది. ఈ చిత్రంలో గుర్రంతో రిస్కీ షాట్స్‌ చేశాడు. రెండు మూడుసార్లు పడ్డాడు. నటుడిగా ఈ చిత్రంతో తను నెక్ట్స్‌ లెవల్‌కి వెళతాడు. టాలీవుడ్‌లో అనుష్క తర్వాత అంత డెడికేషన్‌ రకుల్‌లో చూశా'' అన్నారు

    నాకు తోడైంది

    నాకు తోడైంది

    ‘‘ఈ సినిమా సెట్‌లో తేజ్‌ని చూస్తున్నప్పుడు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ని దర్శకత్వం చేస్తున్నట్టు అనిపించింది. మంచి మనిషి తేజ్‌. తను నాకు సోదరుడికంటే ఎక్కువ. ఈ సినిమాతో తేజ్‌ మరో స్థాయికి వెళతాడు. గుర్రాలపై సాహసోపేతమైన సన్నివేశాలు చేశాడు. డ్యాన్సులు, భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు... ఇలా అన్నింటిలోనూ చక్కటి పనితీరును కనబరిచాడు. రకుల్‌తో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని ఉంది. ఇందులో జగపతిబాబుగారి నటన బాగుంటుంది. నటీనటులతో పాటు, మంచి సాంకేతిక బృందం నాకు తోడైంద.''అన్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని.

    డకౌట్ అయ్యాడు

    డకౌట్ అయ్యాడు

    . ''నేను, తేజు క్రికెట్‌ ఆడుతుంటాం. ధోనీ ఫస్ట్‌ మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు. మా ఫస్ట్‌ మూవీ డకౌట్‌ అయ్యింది. ఈ 'విన్నర్‌' మాత్రం పెద్ద హిట్‌ అవుతుంది. తేజుకి మ్యూజిక్‌ చేసేటప్పుడు మెగాస్టార్, పవర్‌స్టార్, స్టైలిష్‌ స్టార్‌ గుర్తుకొస్తారు నాకు'' అని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు.

    వాళ్లందరి కలిపి

    వాళ్లందరి కలిపి

    ‘‘తేజ్‌కి సంగీతం చేసేటప్పుడు మనసులో మొదట చిరంజీవిగారు, తర్వాత పవన్‌కల్యాణ్‌గారు, ఆ తర్వాత అల్లు అర్జున్‌ గుర్తుకు వస్తారు. వీళ్లందరినీ కలిపి పాటలు చేస్తా. తేజ్‌ తదుపరి చిత్రం ‘జవాన్‌'కి కూడా నేనే పాటలు ఇస్తున్నా'' అన్నారు తమన్‌.

    అది కూడా రాదు

    అది కూడా రాదు

    నాగబాబు మాట్లాడుతూ- ''మా అమ్మ అంటే మాకు ఇష్టం. వాళ్ల అమ్మ అంటే తేజూకి చాలా ఇష్టం. తనలో నాకు నచ్చేది అదే. వాడికి అబద్ధం కూడా చెప్పడం రాదు . చిన్నప్పుడు నిజాలు చెప్పి తిట్లు తినేవాడు'' అన్నారు.

    కథ నాకు తెలుసు

    కథ నాకు తెలుసు

    నాగబాబు మాట్లాడుతూ ‘‘సాయిధరమ్‌ తేజ్‌ నా ప్రియమైన మేనల్లుడు. తనలో నాకు నచ్చేది వాళ్ల అమ్మపై తనకుండే ప్రేమ. తనకి పురస్కారం వస్తే అందుకోవడానికి వేదికపైకి అమ్మని పిలిచాడు. ఆ రోజు ఆనందమేసింది. మా అమ్మంటే మాకు చాలా ఇష్టం. మా మేనల్లుడికీ మా చెల్లెలంటే అంతే ప్రేమ. తేజ్‌లో నిజాయతీ ఎక్కువ. అబద్ధం చెప్పడం రాదు. నాకైనా, మా అన్నయ్యకైనా, తమ్ముడికైనా వాడంటే చాలా ఇష్టం. అన్నిటికంటే నాకు బాగా సంతోషమేంటంటే తేజ్‌ అంచలంచెలుగా ఎదుగుతున్నాడు. ‘విన్నర్‌' పేరు బాగుంది. ఈ కథ నాకు తెలుసు. మా తేజ్‌తో ఈ కథని చేస్తున్నారనగానే సంతోషమేసింది. గోపీచంద్‌ మలినేని మంచి దర్శకుడు. నిర్మాతలు నాకు ఆత్మీయులు. తమన్‌ స్వరాలు బాగున్నాయి'' అన్నారు.

    బాగా వచ్చిందని...

    బాగా వచ్చిందని...

    దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ ‘‘తేజ్‌ కూడా వాళ్ల మావయ్యలాగే పెద్ద స్థాయికి వెళతాడు''అన్నారు. ఈ సినిమా బాగా వచ్చిందని విన్నానని, ఖచ్చితంగా మంచి విజయం సాధించే చిత్రం అవుతుందని చెప్పారు.

    బాగున్నాయి..

    బాగున్నాయి..

    ‘‘గోపీ కెరీర్‌లోనే గొప్ప విజయంగా నిలుస్తుందీ సినిమా. తేజ్‌ టాప్‌ పొజిషన్‌లోకి వెళతాడు. తమన్‌ పాటలు బాగున్నాయి''అన్నారు దర్శకుడు సురేందర్‌ రెడ్డి. ఈ సినిమా విజయం పై తన నమ్మకం వ్యక్తం చేసారు.

    రెండు మూడు సార్లు క్రింద పడ్డాడు

    రెండు మూడు సార్లు క్రింద పడ్డాడు

    ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ ....‘‘ఒక కొత్త నేపథ్యంలో సాగే సినిమా ఇది. సాయిధరమ్‌ గుర్రంపై నుంచి రెండు మూడుసార్లు కిందపడ్డాడు. తనకి ఏమైనా అవుతుందేమో అని సినిమా చిత్రీకరణ జరుగుతున్నంతకాలం భయపడ్డా. తనకి ఏమైనా అయితే తన ముగ్గురు మావయ్యలకి సమాధానం చెప్పాలి. తేజ్‌ మాత్రం ‘చోటా మామా... మావయ్యలకంటే ముందు అమ్మకి సమాధానం చెప్పాలి' అనేవాడు.

    చిరంజీవే గుర్తు వచ్చారు

    చిరంజీవే గుర్తు వచ్చారు

    ఛోటా కె.నాయుడు కంటిన్యూ చేస్తూ.... చిన్నప్పట్నుంచి తేజ్‌ని చూస్తున్నా. తనలో ఎలాంటి మార్పు లేదు. గుర్రంపై వస్తున్నప్పుడంతా చిరంజీవిగారే గుర్తుకొచ్చారు. ఆయనకున్న లక్షణాలు, ఆయన పోలికలు తేజ్‌లో పుష్కలం. ఈ స్థాయిలో సినిమా రావడానికి కారణం తేజే. గోపీచంద్‌ ఈ సినిమాతో చాలా ఎదిగిపోయాడు'' అన్నారు.

    ఈ ఈవెంట్ లో ...

    ఈ ఈవెంట్ లో ...

    ఈ కార్యక్రమంలో నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, పీవీపీ, 'జెమినీ' కిరణ్, రాజీవ్‌ రెడ్డి, దర్శకులు శ్రీను వైట్ల, సురేందర్‌ రెడ్డి, మెహర్‌ రమేశ్, బాబీ, అనిల్‌ రావిపూడి, బీవీఎస్‌ రవి, సంకల్ప్, కెమేరామ్యాన్‌ ఛోటా కె.నాయుడు, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, యాంకర్‌ అనసూయ, ఎడిటర్‌ గౌతంరాజు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్, మాటల రచయిత అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.

    rn

    ట్రైలర్ కేక పెట్టించింది

    రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. మాస్ యాక్షన్ తో పాటు కామెడీ పంచ్ లతో కట్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్ కు యూట్యూబ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

    హిట్ అవ్వాలంటే...

    హిట్ అవ్వాలంటే...

    ఇక ఈ చిత్రం బడ్జెట్ 24 కోట్లకు చేరింది. సాయి ధరమ్ రికార్డ్, గోపిచంద్ మలినేని మీద ఉన్న అంచనాల నేపథ్యంలో సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ సినిమా ఓవర్ సీస్ తో కలిపి దాదాపు 30 కోట్ల వరకు బిజినెస్ అయిపోయింది. అంటే విన్నర్ 30 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తేనే విన్నర్ హిట్ లిస్ట్ లోకి చేరుతోంది. ఇప్పటి వరకు 25 కోట్ల క్లబ్ లోనే ఆగిపోయిన సాయి, విన్నర్ తో కొత్త రికార్డ్ సృష్టిస్తాడేమో చూడాలి

    English summary
    'Winner' will hit the screens on Feb 24. The makers arange a grand pre-release event on Feb 19, keeping with the tradition set by 'Sarrainodu', 'Dhruva' and 'Khaidi No. 150'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X