»   » చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ వల్లే ఇక్కడి దాకా... (తిక్క ఆడియో వేడుక)

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ వల్లే ఇక్కడి దాకా... (తిక్క ఆడియో వేడుక)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై సునీల్‌ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్‌కుమార్‌ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'తిక్క'. లారిస్సా బోనేసి, మన్నార్‌ చోప్రా హీరోయిన్స్‌ గా నటించారు. ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జానా రెడ్డి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయగా, ఆడియో సీడీలను వంశీపైడిపల్లి విడుదల చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. సినిమా విడుదలై అందరి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.


సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ....'చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌గారి ఆశీర్వాదాలతోనే ఇక్కడకు రాగలిగాను. జీవితాంతం వారికెప్పుడూ నేను రుణపడే ఉంటాను' అని అన్నారు. సాయి ధరమ్ తేజ్ ఈ మాట అనగానే అభిమానులు కరతాల ధ్వనులు, విజిల్స్ తో ఆడియో వేడుక ప్రాంగణాన్ని హోరెత్తించారు.


సినిమా గురించి మాట్లాడుతూ...కథ వినగానే, బ్రేకప్‌ లవ్‌స్టోరీ, నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. సునీల్‌రెడ్డిగారితో ఎప్పటి నుండో మంచి పరిచయం ఉంది. రోహిణ్‌ అన్న బ్రదర్‌లా సపోర్ట్‌ చేస్తూ ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను నిర్మించారు. థమన్‌ స్పోర్టివ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ సినిమాకు ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. గుహన్‌గారు మంచి సినిమాటోగ్రఫీ అందించారు అన్నారు.


స్లైడ్ షోలో మరిన్ని శేషాలు, ఫోటోస్..


ప్లాప్ డైరెక్టర్ అయినా..

ప్లాప్ డైరెక్టర్ అయినా..

డైరెక్టర్ సునీల్‌ రెడ్డి మాట్లాడుతూ ...సాయిధరమ్‌తేజ్‌, రోహిణ్‌రెడ్డిగారికి థాంక్స్‌ చెప్పినా సరిపోదు. ప్లాప్‌ డైరెక్టర్‌ అయిన నన్ను నమ్మి సాయి, రోహిణ్‌గారు అవకాశం ఇచ్చారు. నాకు సపోర్టు చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.


తేజు ఇంకా భయంతోనే..

తేజు ఇంకా భయంతోనే..

వంశీపైడిపల్లి మాట్లాడుతూ 'తేజు సక్సెస్‌ఫుల్‌ హీరో అయ్యాడు. తను భయంతో కెరీర్‌ మొదలు పెట్టాడు. ఇంత సక్సెస్‌ అయినా ఆ భయం అలాగే ఉంది. ఆ భయాన్ని అలాగే పెట్టుకుంటే తను ఇంకా ఎదుగుతాడు. ఇది తనకు బిగినింగ్‌ మాత్రమే. తను ఎన్నో ఉన్నత స్థానాలు చేరుకోవాలి అన్నారు.


ధనుస్, శింబు పాటలు

ధనుస్, శింబు పాటలు

ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ తేజ్‌ నాకు మంచి క్రికెట్‌ పార్ట్‌ నర్‌. డైరెక్టర్ సునీల్‌ రెడ్డితో వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. ధనుష్‌, శింబు ఈ సినిమాలో పాటలు పాడినందుకు వారికి థాంక్స్‌. సాయిధరమ్‌లో చాలా ఎనర్జీ ఉంది. సపోర్ట్‌ చేసినందుకు అందరికీ థాంక్స్‌'' అన్నారు.


మెగా ఫ్యామిలీ అంటే భయం

మెగా ఫ్యామిలీ అంటే భయం

సి.రోహిణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ''మెగాఫ్యామిలీ అంటే చిన్నప్పట్నుంచి నాకు అభిమానం. ఈ సినిమా విషయంలో తేజుతో వర్క్‌ చేస్తున్నప్పుడు నా బ్రదర్‌తో చేస్తున్నట్లు అనిపించింది. సునీల్‌రెడ్డి, తేజుతో మొదటి సినిమా పనిచేయడం హ్యాపీగా ఉంది. థమన్‌ మంచి మ్యూజిక్‌ అందించాడు అన్నారు.


రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఆగస్ట్‌ 13న సినిమా రిలీజ్‌ అవుతుంది. మా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా డెఫనెట్‌గా హిట్‌ అవుతుంది అనే నమ్మకం వ్యక్తం చేసారు నిర్మాత.తిక్క

తిక్క

కోనవెంకట్‌ మాట్లాడుతూ ''చిరంజీవిగారు, పవన్‌ కళ్యాణ్‌గారి తిక్కెంటో మేం చూశాం. ఇప్పుడు తేజు తిక్కెంటో చూడాలనుకుంటున్నాం. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.


దిల్‌రాజు మాట్లాడుతూ

దిల్‌రాజు మాట్లాడుతూ

'నిర్మాత రోహిణ్‌రెడ్డిగారు రాజకీయాల నుండి సినిమాల్లోకి వచ్చారు. ఆయనకు, దర్శకుడు సునీల్‌రెడ్డికి, టీంకు ఆల్‌ ది బెస్ట్‌. సాయిధరమ్‌ ఈ సినిమాతో తన తిక్క చూపించి మరో సక్సెస్‌ సాధించాలని అనుకుంటున్నాను''అన్నారు.
English summary
Sai Dharam Tej Thikka Movie Audio Launched yester day. ‘Thikka’ which is directed by directed by Sunil Reddy. This film is full length comedy and love entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu