»   » సాయి ధరమ్ తేజ బెండు తీసాడట

సాయి ధరమ్ తేజ బెండు తీసాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ''వైవీఎస్‌ చౌదరిగారితో సినిమా చేస్తున్నప్పుడు కాస్త భయపడ్డాను. సినిమా వచ్చిన తీరు ఆనందాన్నిస్తోంది. ఆయన బెండు తీసేస్తారు అంటూ కొందరు అంటుంటారు. కానీ సినిమా బాగా రావడం కోసమే అలా చేస్తారు. ఇన్నాళ్లు మేము పడ్డ కష్టాన్ని మే 9న మరచిపోతాము''అన్నారు సాయిధరమ్‌తేజ్‌. అంటే సినిమా బాగా రావటం కోసమే అయినా వైవియస్ చౌదరి....మన హీరోగారి బెండు తీసాడన్నమాట. సినిమా బాగా వచ్చిందని టాక్ అంతటా ఉంది.

వైవీఎస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'రేయ్‌'. సాయిధరమ్‌తేజ్‌ హీరో. సయామీఖేర్‌, శ్రద్ధాదాస్‌ కథానాయికలు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని హీరో రామ్‌ ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్బంగా సాయి ధరమ్ తేజ ఇలా స్పందించారు.

రామ్‌ మాట్లాడుతూ ''వైవీఎస్‌ చౌదరి ధైర్యంతో సినిమా తీస్తారు. ఇంకా ఈ తత్వం వినాయక్‌, రాజమౌళిగార్లలోనే చూశాను. వైవీఎస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను అని సాయిధరమ్‌తేజ్‌ చెప్తే 'ఎందుకు, ఏమిటి, ఎలా.. అని అడగకుండా చెప్పింది చేసుకొని వెళ్లు అంతా మంచే జరుగుతుంది' అని చెప్పాను. అంతగా ఆయన మీద నాకు నమ్మకం ఉంది'' అన్నారు.

Sai Dharm Teja about his director Y.V.S Chowdary

వైవియస్ చౌదరి మాట్లాడుతూ... ''సాయిధరమ్‌తేజ్‌లో రెండు కోణాలున్నాయి. 'రౌడీ అల్లుడు'లో చిరంజీవిగారు పోషించిన కల్యాణ్‌ కుమార్‌ పాత్రలా నెమ్మదిగాను, ఆటో జానీలా మాస్‌గానూ సాయిధరమ్‌తేజ్‌ నాకు కనిపిస్తుంటాడుయ. సినిమా విజయం తర్వాత కొట్టే చప్పట్ల కన్నా.. ముందు కొట్టే చప్పట్లకు విలువ ఎక్కువ. నాకు ఈ సినిమా ద్వారా అవి లభించాయి. చక్రి, చంద్రబోస్‌, శ్రీధర్‌ సీపాన తదితర చిత్రబృందం చక్కటి సహకారం అందించారు. వచ్చే నెల 9న ప్రేక్షకులు కొట్టే చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నాం'' అన్నారు.

చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తీసుకవస్తున్నారు. ఏదైనా మేనమామ పోలికలు వస్తే అదష్టవంతులవుతారంటారు. మరి తన మేనమామలా సాయి ధరమ్ తేజ కూడా స్టార్ అవుతాడో లేదో వేచి చూడాల్సిందే...

ఎవరేమన్నా మెగాస్టార్ మాత్రం తమ కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమవుతున్న తమ బిడ్డల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానంటున్నారు. దేవదాసుతో సంచలన విజయం నమోదు చేసిన వైవిఎస్ చౌదరి సాయిధరమ్ తేజతో ఎటువంటి హిట్ ఇస్తారో చూడాలి. చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

English summary
Sai Dharam Tej's debut movie Rey will now hit the big-screens on May 9th. YVS Chowdary, the director and producer of the film announced the new release date. ,The film will going to create record by releasing in west indies also.If it happens Rey will stood as the first tollywood film to release in west indies
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu