»   » సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్(ఫోటో పీచర్)

సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రం ఓపినింగ్(ఫోటో పీచర్)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. గీతా ఆర్ట్స్ మరియు ఎస్ వి.సి సినిమాస్ బ్యానర్ పై బన్నివాసు-దిల్ రాజు మేనల్లుడు హర్షిత్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

  మెగా బ్రదర్శ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

  అనంతరం తొలిసన్నివేశానికి చిరంజీవి క్లాప్ ఇవ్వగా, పవన్ కళ్యాణ్ కెమెరా స్విఛ్చాన్ చేసారు.

  కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

  చిరంజీవి మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ నా మేనల్లుడు మాత్రమే కాదు. చరణ్ తర్వాత మరో తనుయుడు లాంటివాడు. తన రెండవ చిత్రం గీతా ఆర్ట్స్ లో చేయటం శుభసూచకంగా భావిస్తున్నాను. మా కుటుంబం నుంచి వచ్చే ప్రతీ హీరోకి ఈ బ్యానర్ లో చేయటం ఓ సెంటిమెంట్ అని చెప్పాలి. చరణ్ రెండో చిత్రం మగధీర కూడా అదే బ్యానర్ లో చేసాం. ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అలాగే దిల్ రాజు బ్యానర్ కూడా చాలా సెంటిమెంట్ అన్నారు.

  అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మా బ్యానర్ లో చేస్తున్న 32వ చిత్రం ఇది. మొదటి నుంచి దిల్ రాజుకి నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ సినిమాకు తన భాగస్వామ్యం కూడా ఉంటే బావుంటుందని నిర్మాణ భాధ్యతలు ఆయనకు అప్పగించాను అన్నారు.

  దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ..

  దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ..

  మొదటి దిల్ రాజు గారికి కథ చెప్పాను. ఆయన నచ్చి అరవింద్ గారి దగ్గరకి తీసుకు వెళ్లారు. ఆయనకు కూడా నచ్చి వెంటనే ఓకే అన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలతో చేసే అవకాసం రావటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

  దిల్ రాజు మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పినప్పుడు మా బ్యానర్ లో చేద్దామనుకున్నాను. ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నేను చేయలేకపోతున్నాను. అరవింద్ గారితో అశోశియేట్ అయ్యి చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.

  సాయి ధరమ్ తేజ మాట్లాడుతూ... నన్ను ఆశ్విదించటానికి మా మామయ్యలందిరకీ ధాంక్స్. పెద్ద ప్రొడ్యూసర్స్ తో ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

  శ్రీహరి, దువ్వాసి మోహన్, చంద్రమోహన్, సత్యకృష్ణన్, ధర్మవరం, రఘుబాబు తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు మరుధూరి రాజా, పాటలు చంద్రబోస్, అశోక్ తేజ, శ్రీమణి, సంగీతం అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి దాశరధి శివేంద్ర, ఆర్ట్ రమణ వంక, ఎడిటింగ్ గౌతంరాజు, నిర్మాత బన్ని వాసు, హర్షిత్, కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఎఎస్ రవికుమార్ చౌదరి.

  ఈ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి పద్మభూషణ్ చిరంజీవి, నాగబాబు, పనవ్ కళ్యాణ్, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, వివి వినాయిక్, రాజమౌళి, సుకుమార్, వంశీ పైడిపల్లి, కైకాల నాగేశ్వరరావు, డా వెంకటేశ్వరరావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నాగ అశోక్ కుమార్, సురేష్ బాబు, తదితరులుతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

  English summary
  Sai Dharam Tej's (megastar Chiranjeevi's nephew) new film was launched at Annapurna Studios on Saturday. To be directed by AS Ravi Kumar Chowdary, the untitled project is produced by Bunny Vas while Allu Aravind is presenting the film in association with Dil Raju's Sri Venkateswara Creations. A formal pooja ceremony was held and the regular shooting will commence from next month. Mega heroes Chiranjeevi, Pawan Kalyan, Allu Arjun, Nagababu, Allu Sirish attended the event to wish Sai Dharam Tej good luck. Anup Rubens is scoring the music.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more