»   » ప్రేయసి ఆశయం కోసం... (‘రేయ్' ప్రివ్యూ)

ప్రేయసి ఆశయం కోసం... (‘రేయ్' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓ సినిమా ప్రారంభమైన ఐదు సంవత్సరాలు గడిచి రిలీజ్ కు సిద్దమైన తెలుగులో పెద్ద సినిమా ఈ మధ్యకాలంలో ఇదేనేమో. ఎప్పుడెప్పుడు రిలీజా అని మెగాభిమానులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం మొత్తానికి అన్ని సమస్యలూ దాటుకుని ఈ రోజు విడుదలకు సిద్దమైపోయింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా కావటం, పిల్లా నువ్వులేని జీవితం విజయ సాధించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో ఫలితం ఎలా ఉంటుందోనని అంతా ఆత్రుతగా, ఒకింత ఆందోళనగా చూస్తున్నారు. ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు కావడం విశేషం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'రేయ్‌' స్టోరీలైన్...


ప్రపంచ పాప్ సంగీత పోటీలో విజేతగా నిలిచే క్రమంలో ఓ యువకుడు తన బృందంతో కలిసి సాగించిన ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. సంగీత పోటీ ప్రధానంగా సాగే చిత్రమిది. ఒక పెద్ద హీరో సినిమా ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉంటుంది. సాయిధరమ్ తేజ పాత్ర పేరు రాక్‌. ఏదైనా మొహంమీదే చెప్పేసే కుర్రాడిగా కనిపిస్తాడు. కరీబీయన్‌ కుర్రాళ్ల లుక్స్‌ ఆ పాత్రలో కనిపిస్తాయి. హీరోయిన్ కు ఓ ఆశయం ఉంటుంది. ప్రేమలో పడ్డాక ఆ అమ్మాయి ఆశయాన్ని తన ఆశయంగా చేసుకొని ఎలా పోరాటం చేశాడు? తన ప్రేయసి కలని ఎలా నెరవేర్చాడు? అనే అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.


Sai Dharma Teja's Rey preview

మేజర్ హైలైట్స్


పాటలు, క్లైమాక్స్ ఎపిసోడ్, వినోదం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గోలీమార్... రీమిక్స్ సాంగ్ ఇప్పటికే పెద్ద విజయాన్ని సాధించింది. చక్రి సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వై.వి.యస్. చౌదరి సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. వెస్టిండీస్, అమెరికా, బ్యాంకాక్, సింగపూర్, మలేషియాతో పాటు హైదరాబాద్‌లలో చిత్రీకరణ సాగింది.


సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఓ డాన్సర్ లా కనిపిస్తాడు. డాన్సర్ గా అదిరిపోయే స్టెప్స్ వేశాడని సమాచారం. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసేలా ఈ సినిమాలో అదిరిపోయే స్టెప్స్ తో మెగా అభిమానులకు పెద్ద ట్రీట్ ఇవ్వనున్నాడని ఈ సినిమా చూసిన కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా చివరి సాంగ్ లో సూపర్బ్ స్టెప్స్ తో ఆకట్టుకుంటాడని సమాచారం.


సాయిధరమ్ తేజ మాట్లాడుతూ... వెస్టిండీస్‌కు చెందిన ఆధునిక యువకుడిగా కనిపిస్తాను. నా పాత్ర ఆహార్యం ,తీరుతెన్నుల కోసం విల్‌స్మిత్, బాబ్‌మార్లీ, క్రిస్‌బ్రౌన్ లాంటి తారల్ని స్ఫూర్తిగా తీసుకొని నా పాత్రను డిజైన్ చేశారు. తెలుగు ప్రేక్షకులను మెప్పించే కమర్షియల్ హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి.
తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకముంది అని అన్నారు.


వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్‌లో సెటిల్‌ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్‌ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్‌, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్‌లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. '' అని తెలిపారు. ఈ చిత్రాన్ని వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు.


ఇక సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి ‘A' సర్టిఫికెట్ జారీ చేసారు. అంతే కాకుండా సినిమాలో 41 చోట్ల సెన్సార్ కట్స్ విధించింది. మరో వైపు సినిమా రన్ టైం కూడా ఎక్కువగానే ఉంది. ఏకంగా 168 నిమిషాల నిడివి ఉంది. అంటే దాదాపు 2 గంటల 50 నిమిషాలు.


బ్యానర్: బొమ్మరిల్లు
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధ దాస్, అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు
సంగీతం: చక్రి,
కూర్పు: గౌతంరాజు,
ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.
మాటలు: శ్రీధర్‌ సీపాన,
సమర్పణ: యలమంచిలి గీత
స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: వైవియస్ చౌదరి
విడుదల తేదీ : మార్చి 27,2015.

English summary
After lying in the cans for a long long time, Sai Dharam Tej's 'Rey' is finally seeing the light of the day. This film, directed by YVS Chowdary, will be hitting the theatres worldwide on March 27th, the same day on which Ram Charan celebrates his birthday.
Please Wait while comments are loading...