»   » మోక్షజ్ఞ ఎంట్రీ, బాలయ్య 100పై సాయి కొర్రపాటి క్లారిటీ

మోక్షజ్ఞ ఎంట్రీ, బాలయ్య 100పై సాయి కొర్రపాటి క్లారిటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని రోజులుగా రెండు విషయాలు బాలయ్య అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి. అందులో ఒకటి బాలయ్య 100వ సినిమా, రెండోది బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ. బాలయ్య 100వ సినిమా ఎవరితో చేస్తున్నారు? ఎలాంటి సినిమా చేస్తున్నారనే విషయమై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. మరో వైపు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సొంత ఫ్యామిలీ నుండే బాలయ్యకు విలన్ తయారయ్యాడు!

అయితే నిర్మాత సాయి కొర్రపాటి ఈ రెండు అంశాలకు సంబంధించి కొన్ని క్లూస్ ఇచ్చారు. బాలయ్య వందో సినిమాను ‘లెజెండ్' సినిమా తీసిన 14 రీల్స్ - వారాహి చలనచిత్రం బేనర్లు సంయుక్తంగా నిర్మిస్తాయని వెల్లడించారు. అయితే ఈ సినిమా ఏ దర్శకుడితో ఉంటుందనే విషయంపై మాత్రం సాయి స్పందించడానికి నిరాకరించారు.

తన కొడుకు అఖిల్ కాకూడదనే బాలయ్య అలా అన్నారా?

మోక్షజ్న ఎంట్రీ గురించి కూడా సాయి స్పందించారు. బాలయ్య కొడుకును తమ సంస్థ ద్వారానే హీరోగా పరిచయం చేస్తున్నామని తెలిపారు. అయితే మోక్షు ఎంట్రీ ఎప్పుడన్నది కరెక్టుగా చెప్పలేనని అన్నాడు. సాయి కొర్రపాటి చెప్పిన విషయం బట్టి ఓ విషయం స్పష్టం అవుతోంది. బాలయ్యకు సాయి కొర్రపాటి చాలా క్లోజ్ అయ్యారని, అందుకే ముఖ్యమైన విషయాలన్నీ సాయికే అప్పజెబుతున్నారు బాలయ్య.

అమ్మాయికి ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలి: బాలయ్య షాకింగ్ కామెంట్స్!

Sai Korrapati about Balakrishna 100th movie

కృష్ణ వంశీ దర్శకత్వంలో ఉంటుందా?
ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ కొన్ని రోజులుగా ‘రుద్రాక్ష' పేరుతో హారర్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్స్ మీదకు రావాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి బాలయ్య 100వ సినిమా చేసే అవకాశం రావడంతోకృష్ణ వంశీ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రంలో బాలయ్య రైతుగా కనిపించబోతున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడనుంది. చాలా కాలం నుండి బాలయ్యతో పని చేయాలని కృష్ణ వంశీ ఎదురు చూస్తున్నారు.

బాలయ్య కోసం చాలా కాలం క్రితమే స్క్రిప్టు కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. గత నెలలో బాలయ్యను కలిసి కథ వినిపించాడు. బాలయ్యకు కథ నచ్చడంతో వెంటనే దాన్నే 100వ సినిమాగా చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మే నెలలో కృష్ణ వంశీ దర్శకత్వంలో బాలయ్య 100వ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

English summary
Sai Korrapati about Balakrishna 100th movie and Mokshagna Debut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu