For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR అలాంటి సినిమా కాదు.. డైలాగ్ రైటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  |

  బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. తన తదుపరి ప్రాజెక్ట్‌గా భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ఎంచుకున్నాడు. తెలుగులోని టాప్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను ఒకే తెరపై తీసుకురానున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా.. అటు మెగాభిమానులు, ఇటు నందమూరి ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు.

  అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా..

  అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా..

  బాహుబలి చిత్రాలు ఇచ్చిన కాన్ఫిడెంట్‌తో భారీ బడ్జెట్‌ను పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అందులోనూ రాజమౌళి దర్శకుడు అడిగితే ఎంతైనా పెట్టడానికి వెనకాడని నిర్మాతలు ఎందరో ఉన్నారు. ఇద్దరు పెద్ద హీరోలను ఒకే స్క్రీన్‌పై తీసుకొచ్చే ఈ అతి పెద్ద మల్టీ స్టారర్ డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్‌పై డీవీవీ దానయ్య ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నాడు. కేవలం హీరోల ఇంట్రడక్షన్‌కు వంద కోట్లు దాటినట్లు అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి.

  బాలీవుడ్ తారాగణాన్ని దింపిన జక్కన్న..

  బాలీవుడ్ తారాగణాన్ని దింపిన జక్కన్న..

  రాజమౌళి డేట్స్ అడగాలే.. గానీ ఇచ్చేందుకు ఎంతటి హీరో అయినా, హీరోయిన్ అయినా సిద్దంగానే ఉంటారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తోన్న రామ్ చరణ్ పక్కన సీత క్యారెక్టర్‌ను పోషిస్తోంది. ఇక కొమురం భీమ్, అల్లూరి పాత్రలకు మార్గనిర్దేశకం చేసే క్యారెక్టర్‌లో అజయ్ దేవగణ్ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

  కథను ముందే చెప్పేసిన రాజమౌళి

  కథను ముందే చెప్పేసిన రాజమౌళి

  ఏ సినిమాను చేసినా.. దాని కథను ముందే అందరికీ చెప్పేయడం రాజమౌళికి చెప్పడం అలవాటు. అయితే దాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తాడన్న విషయాన్ని ప్రేక్షకుల ఊహకే వదిలేస్తాడు. అలాగే ఆర్ఆర్ఆర్ కథను కూడా ముందే చెప్పాడు. చరిత్రలో నిజంగా ఉన్న అల్లూరి, కొమురం భీమ్ పాత్రలను తీసుకుని ఊహాత్మకంగా కల్పిత గాథను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

  షూటింగ్‌కు ఎక్కువైన బ్రేకులు..

  షూటింగ్‌కు ఎక్కువైన బ్రేకులు..

  ఈ మూవీ ఏ ముహుర్తాన మొదలు పెట్టారో గానీ బ్రేకులు మాత్రం తెగ విసిగిస్తున్నాయి. మధ్యలో హీరోలకు గాయాలు కావడం, వారు మిగతా పనుల్లో బిజీ కావడం, మళ్లీ రాజమౌళి బిజీ అవ్వడం ఇలా ఏదో ఒకటి జరిగి షూటింగ్స్‌కు బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. తాజాగా బాహుబలి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కోసం రాజమౌళి లండన్ వెళ్లడంతో మళ్లీ బ్రేక్ పడింది.

  అలాంటి సినిమా కాదు..

  అలాంటి సినిమా కాదు..

  RRR కంటెంట్ ఉండే సినిమా. స్టార్ల ఇమేజ్ పై రన్ అయ్యే సినిమా కాదు. పంచ్ డైలాగ్స్ రాయాల్సిన అవసరం లేదు.. మాస్ ప్రేక్షకులకోసం ప్రత్యేకంగా సీన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా కథ అంత బలమైనదంటూ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించేశాడు. కథలో దమ్ముండాలే గానీ హీరోయిజాన్ని రాజమౌళి ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిందే.

  English summary
  Sai Madhav Burra Interesting Comments On RRR. Which Is directed By Rajamouli. Starring NTR, Ram Charn, Alia Bhatt And Aja Devgan. This Movie Is Going To Relese On 30 june
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X