»   » బూతులు మాట్లాడి ‘ఫిదా’ చేసిన హీరోయిన్ (వీడియో)

బూతులు మాట్లాడి ‘ఫిదా’ చేసిన హీరోయిన్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఫిదా'. ఈ మూవీలో తమిళ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో చేస్తున్న క్యారెక్టర్‌కు బాగా సూటయ్యేలా సాయి పల్లవి వాయిస్ ఉండటంతో ఆమెతోనే డబ్బింగ్ కూడా చెప్పించాడు డైరెక్టర్.

తాజాగా సాయి పల్లవి డబ్బింగ్ చెప్పిన ఓ వీడియో బైట్ విడుదల చేశారు. తెలుగు బాష తెలియని సాయి పల్లవి డబ్బింగ్ చెప్పేందుకు చాలానే కష్టపడింది. హీరోను 'బాడ్కోవ్ బలిసిందారా... బొక్కలిరగ్గొడతా, బద్మాష్ బలిసిందారా... బొక్కలిరగ్గొడతా' అంటూ తెలంగాణ యాసలో సాయి పల్లవి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ''చక్కని ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆనంద్ , గోదావరి తర్వాత పూర్తిస్థాయి ప్రేమకథతో సినిమా చేయలేదు. ఈ సినిమాకు మంచి యూత్‌ఫుల్‌ కథ కుదిరింది. వరుణ్‌, సాయిపల్లవి జంట చూడముచ్చటగా ఉంటుందన్నారు.


ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఫిదా చిత్రీకరణ ఎక్కువగా యుఎస్ లో జరిగింది. వరుణ్ తేజ్ ఎన్నారైగా కనిపించనున్న ఈ సినిమాలో సాయి పల్లవి ఒక తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది.


English summary
Sai Pallavi Dubbing for Fidaa. Fidaa is an upcoming Telugu film written and directed by Sekhar Kammula. It features Varun Tej and Sai Pallavi in the lead roles which marks the latter's
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu