»   »  తమిళ మాజీ హీరోని తోడు తెచ్చుకుంటున్నాడు

తమిళ మాజీ హీరోని తోడు తెచ్చుకుంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాయిరామ్ శంకర్ కి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. తన అన్న కలగ చేసుకున్నా హిట్ అనేది అతని దరిదాపులకు రావటం లేదు. కెరీర్ మొదలయ్యి చాలా కాలం అయినా నటనలో కొంచెం కూడా ఇంప్రూవ్ మెంట్ లేకపోవటం,అతని వాయిస్ మైనస్ అంటున్నారు. దానికి తోడు కథలు సైతం అతనికి సహకరించటం లేదు. ఈ నేపధ్యంలో అతని కొత్త చిత్రం మొదలైంది. అందులో కీలకపాత్రలో శరత్ కుమార్ ని తీసుకున్నారు. శరత్ కుమార్ సాయింతో అయినా సాయిరామ్ శంకర్ హిట్ కొట్టాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

సాయిరామ్‌ శంకర్‌ హీరోగా విభా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రధారి. సుదర్శన్‌ సలేంద్ర దర్శకుడు. దేపా శ్రీకాంత్‌రెడ్డి నిర్మాత. హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి కాశీ విశ్వనాథ్‌ క్లాప్‌నిచ్చారు. శ్రీకాంత్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

Sai Ram Shankar To Work With Sharath Kumar

దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా సాగే ఈ కథలో అన్ని వాణిజ్య అంశాల్నీ మేళవించాం. సాయిరామ్‌కి కెరీర్‌లోనే చెప్పుకోదగిన పాత్ర ఇది. సాయికుమార్‌ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. హీరోయిన్ ఎవరనేది త్వరలో చెబుతామ''న్నారు. ''స్క్రిప్ట్‌ బాగా వచ్చింది. ప్రతిభగల సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మహత్‌ సంగీతం ఆకట్టుకొంటుంది''అన్నారు నిర్మాత.

ఎమ్మెస్‌ నారాయణ, కాశీ విశ్వనాథ్‌, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, శంకర్‌, ధన్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: త్యాగరాజన్‌, ఛాయాగ్రహణం: మార్టిన్‌ జో, సమర్పణ: యర్రం వంశీధర్‌రెడ్డి.

English summary
Sai Ram Shankar has signed up for a new film in which popular Tamil actor Sharath Kumar is playing a lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu