»   » బాయ్ ఫ్రెండ్ లేడు, లైంగిక వేధింపులే: నటి సాయిశిరీష

బాయ్ ఫ్రెండ్ లేడు, లైంగిక వేధింపులే: నటి సాయిశిరీష

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తన సవతి తండ్రి వేధింపుల వల్లనే ఇల్లు వదిలి బయటకు వచ్చానని నటి సాయి శిరీష స్పష్టం చేసారు. 'లవ్ ఎటాక్' అనే చిత్రంలో నటిస్తున్న సాయి శిరీష మూడు నెలలుగా కనిపించడం లేదని, కిడ్నాప్‌కు గురైందని హైదరాబాద్‌లోని బూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఆమె మంగళవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా సాయి శిరీష మీడియాతో మాట్లాడుతూ....నన్నెవరూ కిడ్నాప్ చేయలేదని, ఇంతకాలం తన స్నేహితురాలి వద్ద ఉన్నానని ఆమె స్పష్టం చేసారు. తన సవతి తండ్రి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అందువల్లే లెటర్ రాసి ఇంటి నుంచి బయటకు వచ్చాని, ఇంతకాలం ఫ్రెండుతో కలిసి హాస్టల్‌లో ఉన్నానని ఆమె తెలిపారు.

బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న వార్తలను సాయి శిరీష ఖండించారు. ఇకపై ఒంటరిగానే ఉంటానని, తన బ్రతుకు తాను బ్రతుకుతానని, ఇంటి ముఖం చూడనని సాయి శిరీష్ తేల్చి చెప్పారు. లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేందుకు, కెరీర్‌ను చక్కదిద్దుకునేందుకు తల్లిదండ్రులకు దూరంగా వచ్చేసానని తెలిపారు.

తన కోరిక తీర్చకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సవతి తండ్రి నీలా ప్రసాద రావు తనను హెచ్చరించాడని ఆమె చెప్పింది. తన తల్లి ఇంట్లో లేని సమయాలు చూసి తన లైంగిక కోరిక తీర్చాలని సవతి తంర్డి ఒత్తిడి పెడుతూ వచ్చాడని ఆయన అన్నాడు. తన తల్లి ఆర్థికంగా ఆయనపై ఆధారపడి బతుకుతోందని, అందువల్ల తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని సాయి శిరీష అంతకు ముందు ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ వెల్లడించింది.

హైదరాబాద్‌లోని బూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సాయి శిరీష

హైదరాబాద్‌లోని బూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సాయి శిరీష

‘లవ్ ఎటాక్' అనే చిత్రంలో నటిస్తున్న సాయి శిరీష మూడు నెలలుగా కనిపించడం లేదని, కిడ్నాప్‌కు గురైందని హైదరాబాద్‌లోని బూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఆమె మంగళవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.

రాజమండ్రి టు హైదరాబాద్

రాజమండ్రి టు హైదరాబాద్

నటి సాయి శిరీష స్వస్థలం రాజమండ్రి. ఆమె సవతి తండ్రి ప్రసాదరావు కారు డ్రైవర్. కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ల ఫ్యామిలీ హైదరాబాద్ షిప్టయింది. జూబ్లీహిల్స్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్లో వీరు నివాసం ఉంటున్నారు.

సాయి శిరీష యాక్టింగ్ కెరీర్

సాయి శిరీష యాక్టింగ్ కెరీర్

కొన్ని సంవత్సరాల క్రితమే బుల్లితెర ద్వారా యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది సాయి శిరీష. లవ్ ఎటాక్ చిత్రం ద్వారా సాయి శిరీష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మరికొన్ని సినిమాలకు కూడా సాయి శిరీష సైన్ చేసింది.

లవ్ ఎటాక్-రొమాంటిక్ డ్రామా

లవ్ ఎటాక్-రొమాంటిక్ డ్రామా

రొమాంటిక్ ఎంటర్టెనర్‌గా లవ్ ఎటాక్
చిత్రం తెరకెక్కుతోంది. ఎం రాజ్ కుమార్
ఈచిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.
ఈ చిత్రంలో వంశీ కృష్ణ హీరోగా నటిస్తున్నారు.

లవ్ ఎటాక్ చిత్రంలో శిరీష రోల్

లవ్ ఎటాక్ చిత్రంలో శిరీష రోల్

లవ్ ఎటాక్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు.
వీరిలో ఒక హీరోయిన్‌గా సాయి శిరీష
నటిస్తోంది. మరొక హీరోయిన్ పాత్రలో
రియా అచ్చప్పా నటిస్తోంది.

ఫేస్ బుక్ బ్యాక్ డ్రాప్‌లో...

ఫేస్ బుక్ బ్యాక్ డ్రాప్‌లో...

లవ్ ఎటాక్ చిత్రం ఫేస్ బుక్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోంది. ఈ కాలం యువతకు ఫేస్ బుక్కే లోకం అయింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయాలు, ప్రేమలు, పెళ్లిళ్లు కామన్ అయిపోయాయి. ఈ విషయాలు సినిమాలో చూపించనున్నారు.

లవ్ ఎటాక్ షూటింగ్

లవ్ ఎటాక్ షూటింగ్

లవ్ ఎటాక్ చిత్రాన్ని మానస ఆర్ట్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. కొన్ని నెలల క్రితమే సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. సాయి శీరిషకు సంబంధించిన 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఆమె నటించాల్సిన భాగం మరో 30 శాతం మిగిలి ఉంది.

లవ్ ఎటాక్ మ్యూజిక్

లవ్ ఎటాక్ మ్యూజిక్

లవ్ ఎటాక్ చిత్రంలో మొత్తం 5 సాంగులు ఉన్నాయి.
ఈ చిత్రానికి శ్రీ వెంకట్ సంగీతం అందించారు.
ఇప్పటికే ఆడియో కూడా రిలీజ్ అయింది.పాటలకు
మంచి రెస్పాన్స్ వచ్చింది.

లవ్ ఎటాక్‌లో గ్రాఫిక్ వర్క్

లవ్ ఎటాక్‌లో గ్రాఫిక్ వర్క్

సినిమా యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో 30 నిమిషాల నిడివిగల గ్రాఫిక్ వర్క్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని, సినిమాకు ఇది హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు.

లవ్ ఎటాక్ చిత్రంలో ఇతర నటీనటులు

లవ్ ఎటాక్ చిత్రంలో ఇతర నటీనటులు

లవ్ ఎటాక్ చిత్రంలో సుమన్, జీవా, బెనర్జీ, తాగుబోతు రమేష్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2013 సంవత్సరాంతంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 సినిమాతో శిరీష దశ తిరుగుతుందా?

సినిమాతో శిరీష దశ తిరుగుతుందా?

నటి సాయి శిరీష తన తొలి చిత్రమైన ‘లవ్ ఎటాక్' చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం హిట్టయి తన పాత్రకు మంచి మార్కులు వస్తే మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉంది.

English summary
Sai Sirisha, a upcoming film actress, has appeared on media nearly 3 months of seclusion to reveal the dirty details behind her disappearance. The girl was missing since May 20, when she left home to attend the shooting of Love Attack.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more