For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినాయక్‌గారు సారీ చెప్పారు..బన్నీతో గొడవ, పవన్ వాడకుండా పడేసిన బైక్‌తో.. సాయిధరమ్ తేజ్!

|

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం చిత్రలహరి. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ కెరీర్ జోరు ఇటీవల బాగా తగ్గింది. ఓ మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని తేజు భావిస్తున్నారు. అలాంటి తరుణంలో చిత్రలహరి చిత్రం గత శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువత నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. సాయిధరమ్ తేజ్ సరసన ఈ చిత్రంలో నివేద పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. చిత్రలహరి విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

వాటర్ దొరికింది

వాటర్ దొరికింది

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజు చిత్రలహరి విజయం గురించి మాట్లాడాడు. చాలా రోజుల తర్వాత ఎడారిలో ఒయాసిస్ లాగా ఎంత వాటర్ దొరికింది అని ప్రశ్నించగా.. ఎంతనేది తెలియదు ఖచ్చితంగా వాటర్ అయితే దొరికింది అని తేజు సరదాగా వ్యాఖ్యానించాడు. చిత్రలహరి చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుండడంతో సాయిధరమ్ తేజ్ సంతోషం వ్యక్తం చేశాడు.

6 ప్లాపులకు కారణం నేనే

6 ప్లాపులకు కారణం నేనే

సుప్రీం చిత్రం వరకు తేజకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత పరాజయాలు ఎదురయ్యాయి. ప్లాపులకు అనేక కారణాలు ఉన్నాయని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. కథని అనుకున్న విధంగా మలచలేకాకపోవడం, విడుదల తేదీ కుదరకపోవడం ఇలా తన చిత్రాలు నిరాశపరచడానికి అనేక కారణాలు ఉన్నాయని తేజు తెలిపాడు. సుప్రీం తర్వాత తనని చుట్టుపక్కలవాళ్ళు చెడగొట్టారనేది అవాస్తవం అని తేజు తెలిపాడు. ఆ ఆరు చిత్రాలు అంగీకరించడంలో నిర్ణయం నాదే. కాబట్టి ప్లాపులన్నింటికీ మొదటి కారణం నేనే అని తేజు తెలిపాడు.

 క్షమాపణ కోరిన వివి వినాయక్

క్షమాపణ కోరిన వివి వినాయక్

తన గత చిత్రాలు నిరాశపరచడంతో ఆ దర్శకులంతా క్షమించమని అడిగారు. ముఖ్యంగా ఇంటెలిజెంట్ తర్వాత వివి వినాయక్ గారు నేను పలు సందర్భాల్లో కలుసుకున్నాం. సారీ తేజు.. నీకు హిట్ ఇవ్వలేకపోయా అని అన్నారు. కసిగా పనిచెయ్.. విజయం తప్పక వరిస్తుంది అని తన ఆశీర్వాదం నాకు ఇచ్చారని సాయిధరమ్ తేజ్ తెలిపాడు.

రీమిక్స్ ఇష్టం లేదు

రీమిక్స్ ఇష్టం లేదు

కెరీర్ ఆరంభంలో వరుసగా చిరంజీవిగారి పాటలు రీమిక్స్ చేశాను. వ్యక్తి గతంగా ఆ పాటలు చేయడం నాకు ఇష్టం లేదు. ఆ పాటలు వింటే చిరంజీవి గారే గుర్తుకురావాలి అని అనిపిస్తుంది. కానీ దర్శకులు ఈ సాంగ్ చేస్తే సినిమాకు బావుంటుంది అని చెప్పడంతో చేశానని సాయిధరమ్ తేజ్ తెలిపాడు. ఇకపై రీమిక్స్ సాంగ్స్ చేసే ఉద్దేశం లేదని తేజు అభిప్రాయపడ్డాడు.

బన్నీతో గ్యాప్

బన్నీతో గ్యాప్

తాను ఎక్కువగా రాంచరణ్, వరుణ్ తేజ్ తో క్లోజ్ గా ఉంటానని తేజు తెలిపాడు. అల్లు అర్జున్ ని అప్పుడప్పుడూ కలుస్తుంటా. తాను నాకు అనేక సలహాలు ఇస్తుంటారని తేజు తెలిపాడు. బన్నీకి నాకు విభేదాలు ఉన్నాయనేది ఇండస్ట్రీలో వచ్చిన రూమర్స్ మాత్రమే అని, అందులో ఎలాంటి వాస్తవం లేదని తేజు తెలిపాడు. తామంతా చిన్నప్పటి నుంచి కలసి పెరిగామని సాయిధరమ్ తేజ్ తెలిపాడు.

వాడకుండా పడేసిన బైక్

వాడకుండా పడేసిన బైక్

పవన్ కళ్యాణ్ తనకు ఖరీదైన బైక్ కొనిచ్చారనే విషయంపై సాయిధరమ్ తేజ్ స్పందించాడు. అది కాస్ట్లీ బైక్ కాదని తేజు నవ్వుతూ అన్నాడు. నా కెరీర్ బిగినింగ్ లో చిత్ర పరిశ్రమలోని అన్ని ఆఫీస్‌ల చుట్టూ తిరిగేవాడిని. ఆ సమయంలో కళ్యాణ్ గారు నన్ను పిలిచి ఒరేయ్ నా దగ్గర బజాజ్ బైక్ ఒకటి ఉంది. నేను వాడడం లేదు. నీకు ఉపయోగపడితే తీసుకుని వెళ్ళు అని అన్నారు. ఆ తర్వాత ఆ బైక్ లోనే సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరిగానని తేజు తెలిపాడు.

English summary
Saidhram Tej responds on differences with Allu Arjun. It is only Gossip says Tej. Chitralahari movie released on 12th April. Kishore Tirumala is the director. Kalyani Priyadarshan, Nivetha Pethuraj are playing female leads
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more