»   » స్టార్ హీరో కుమారుడికి 1.30 కోట్ల గిఫ్ట్.. ఇంతకీ ఎవరీ చిన్నారి.. ఏమిటా గిఫ్ట్!

స్టార్ హీరో కుమారుడికి 1.30 కోట్ల గిఫ్ట్.. ఇంతకీ ఎవరీ చిన్నారి.. ఏమిటా గిఫ్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
స్టార్ హీరో కొడుకుకి 1.30 కోట్ల గిఫ్ట్.. ఇంతకీ ఎవరో తెలుసా ?

బాలల దినోత్సవం అంటే పిల్లలందరూ ఆనందించే రోజు. ఆ రోజు ఏదైనా పేరెంట్స్ నుంచి గిఫ్ట్ లభిస్తే సంతోషానికి అవధులే ఉండవు. బాలీవుడ్‌లో చోటా నవాబ్‌గా పేరు పొందని సైఫ్ ఆలీఖాన్ తన కుమారుడు తైమూర్ ఆలీ ఖాన్‌కు ఇచ్చిన గిఫ్ట్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సింది. నవాబ్ ఖాందాన్‌కు ఏ మాత్రం తగ్గకుండా కోట్ల విలువచేసే బహుమతిని సైఫ్ ఇవ్వడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ గిఫ్ట్ ఏంటో మీరే చూడండి..

 కానుకగా చెర్రీ రెడ్ జీప్

కానుకగా చెర్రీ రెడ్ జీప్

బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్ ముద్దుల కుమారుడు తైమూర్ అలీ ఖాన్. పేరు పెట్టినప్పుడే ఈ చిన్నారి వివాదంలోకి లాగబడ్డాడు. అప్పటి నుంచి అప్పుడప్పుడు మీడియాలో ఏదో రకంగా క్రేజీ కిడ్‌గా నానుతూనే ఉన్నాడు. తాజాగా సైఫ్ ఖాన్ తన కుమారుడికి 1.30 కోట్ల రూపాయల విలువ చేసే జీప్‌ను చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇవ్వడం మీడియాను ఆకర్షించింది.

 తైమూరుకు ప్రత్యేకమైన కారు

తైమూరుకు ప్రత్యేకమైన కారు

తైమూరుకు లభించిన చెర్రీ రెడ్ రంగు జీప్ అంటే ఆటబొమ్మ కాదు. నిజంగా రోడ్లపై పరిగిత్తే కారు. ఈ కారులో ప్రత్యేకంగా బేబీ సీట్ ఉంటుంది. ఈ జీప్‌ను సైఫ్ ఖాన్ సోమవారం మీడియాకు పరిచయం చేశారు. ఇందులో ఉన్న బేబీ సీట్‌లో కూర్చోబెట్టి తైమూర్‌ను ఫస్ట్ రైడ్‌కు తీసుకెళ్తాను అని సైఫ్ వెల్లడించారు.

 తైమూర్ భద్రత కోసమే..

తైమూర్ భద్రత కోసమే..

ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ.. పిల్లల భద్రత గురించి నేను ఎక్కువగా శ్రద్ధ తీసుకొంటాను. అందుకే తైమూరు సేఫ్టీ కోసం 1.30 కోట్లు పెట్టి కారు కొన్నాను. ఈ కారు చూడగానే నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నాలాగే తైమూరు కూడా ఈ కారును ఇష్టపడుతాడు. ప్రత్యేకంగా తైమూర్ దృష్టిలో పెట్టుకొని ఈ కారు కొనుగోలు చేశాను అని అన్నాడు

తైమూరు్ నాలాగే స్టార్ పేరేంట్స్ అబ్బాయి

తైమూరు్ నాలాగే స్టార్ పేరేంట్స్ అబ్బాయి

నేను కూడా రాయల్ ఫ్యామిలీ పుట్టాను. నేను కూడా సూపర్‌స్టార్ పేరేంట్స్‌కు పుట్టాను. నా కుమారుడు కూడా అలాంటి వాతావరణంలోనే పెరుగాలి. తైమూర్‌కు అన్ని రకాలుగా సంతోషాలు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని చెప్పారు.

English summary
Saif Ali Khan and Kareena Kapoor Khan are the royal family of Bollywood and their Chote Nawab Taimur Ali Khan is loved and how. Not just social media goes gaga over his pictures, but Taimur also got a gift worth worth Rs 1.30 crores on Children's day. Excited Saif, soon after buying the jeep, told the media, “There is a baby-seat in the back of the car, so I think I will take Taimur out for a ride in it. He will get the first ride for sure.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu