»   » శ్రీదేవి కూతురుతో చెట్టాపట్టాల్, కొడుక్కు సైఫ్ అలీఖాన్ మందలింపు?

శ్రీదేవి కూతురుతో చెట్టాపట్టాల్, కొడుక్కు సైఫ్ అలీఖాన్ మందలింపు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇటీవల శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ తో క్లోజ్ గా గడిపిన ఫోటోలు కూడా తన సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాడు ఇబ్రహీం. అయితే ఇతర చర్యలు తండ్రి సైఫ్ అలీ ఖాన్ కు కోపం తెప్పించినట్లున్నాయి.

తన కొడుకు గురించి సైఫ్ అలీ ఖాన్ ఇటీవల మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా, ప్రెస్ రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి. అవి నిన్ను పొగుడుతున్నాయంటే ఏదో ఒక రోజు నిన్ను విమర్శిస్తాయి కూడా అని నా కొడుక్కి చెప్పాను' అని తెలిపారు.

ఏదైనా పని చేస్తున్నామంటే దానికి కారణం ఉండాలి. కారణం లేకుండా ఏ పనీ చేయకూడదు. నేను చెప్పిన విషయాలను నా కొడుకు అర్థం చేసుకున్నాడని భావిస్తున్నాను. నీకు ఏదైనా ఆఫర్ వచ్చే వరకు లో ప్రొఫైల్ మెయింటేన్ చేయాలని చెప్పాను. నువ్వు సినిమాల్లోకి రావాలనుకుంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండమని చెప్పాను. నువ్వు ఎవరో ఒకరి కొడుకుగా ఫేమస్ కావాలని చూడొద్దు, నీకు నీవుగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించు అని చెప్పాను అని సైఫ్ తెలిపారు.

సైఫ్-సారా-ఇబ్రహీం

సైఫ్-సారా-ఇబ్రహీం


సైఫ్ అలీ ఖాన్ తన పిల్లలు ఇబ్రహీం, సారాతో కలిసి హాలిడేలో...

సైఫ్-ఇబ్రహీం

సైఫ్-ఇబ్రహీం


కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి సైఫ్ అలీ ఖాన్.

సోహా వెడ్డింగ్ సమయంలో..

సోహా వెడ్డింగ్ సమయంలో..


సోహా అలీ ఖాన్ పెళ్లి సమయంలో సైఫ్ అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ ఇలా...

ఇబ్రహీం-కునాల్

ఇబ్రహీం-కునాల్


సోహా అలీ ఖాన్ భర్త కునాల్ ఖేముతో కలిసి ఇబ్రహీం అలీ ఖాన్.

సెల్పీ

సెల్పీ


ఇబ్రహీం అలీ ఖాన్ సెల్ఫీ...

అవార్డ్ షో..

అవార్డ్ షో..


బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన ఓ అవార్డుల కార్యక్రమంలో తండ్రితో కలిసి ఇబ్రహీం.

ఇబ్రహీం అలీ ఖాన్

ఇబ్రహీం అలీ ఖాన్


తన స్నేహితులతో కలిసి ఇబ్రహీం అలీ ఖాన్ సెల్ఫీ.

ఇబ్రహీం

ఇబ్రహీం


ఇబ్రహీం అలీ ఖాన్ క్యూట్ పిక్చర్స్..

ఇంట్లో...

ఇంట్లో...


కుటుంబ సభ్యులతో కలిసి ఇబ్రహీం అలీ ఖాన్.

ఇబ్రహీం, సైఫ్..

ఇబ్రహీం, సైఫ్..


ఇబ్రహీం అలీ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఫోటోస్ తీసేందుకు వెంట పడుతున్న మీడియా.

English summary
Saif Ali Khan's son Ibrahim Ali Khan is very active on social media and he keeps posting his pictures on Instagram. But it seems that dad Saif is not really happy with it.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu