»   » కిక్: కేవలం పాట కోసం రూ. కోటిన్నర ఖర్చు పెట్టారు!

కిక్: కేవలం పాట కోసం రూ. కోటిన్నర ఖర్చు పెట్టారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'కిక్' సినిమాలో హీరో రవితేజ కిక్కు కోసం ఎంతకైనా తెగిస్తాడనే విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని అదే పేరుతో సల్మాన్ హీరోగా సాజిద్ నడియావాలా నిర్మాణ దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేసారు. సినిమాలో హీరో కిక్ కోసం రకరకాల పనులు చేస్తుంటే...సాజిద్ నడియావాలా మాత్రం రియల్ లైఫ్‌లో కిక్ కోసం రూ. కోటిన్నర ఖర్చు పెట్టారు. దర్శకుడిగా 'కిక్' తన తొలి చిత్రం కావడంతో ఈ పని చేసాడట.

నిర్మాత సాజిద్ నడియావాలా ఎవరో కాదు..... దివంగత నటి దివ్యభారతి భర్త. 1992లో వీరిద్దరి వివాహం జరిగింది. అయితే ప్రమాదవశాత్తు ఆమె ఏప్రిల్ 5, 1993లో మరణించారు. తన భార్యకు సంతాపంగా ఇప్పటి వరకు తను నిర్మించిన ప్రతి సినిమాను ఆమెకు అంకింతం ఇస్తూ వచ్చాడు. తాజాగా తన తొలి దర్శకత్వ సినిమాలో ఆమె పాట ఉండాలని ఆశ పడ్డ సాజిద్ ఆమె నటించిన 'విశ్వాత్మ' చిత్రంలోని 'సాత్ సముందర్ పార్ మే తెరె పీచె పీచె ఆ గయే' అనే సాంగును తన సినిమాలో పెట్టాడు. ఆ పాటంటే సాజిద్‌కు ఎంతో ఇష్టం. సాంగును అప్పట్లో విజు షా కంపోజ్ చేసారు.

Sajid Nadiadwala Paid 1.5 Crores For A Song In Kick

సినిమాలో ఆ పాట పాడుతూ హీరో సల్మాన్ ఖాన్ కనిపిస్తుంటాడు. ఈ పాట రైట్స్ 'సారిగమ' మ్యూజిక్ కంపెనీ నుండి రూ. 1.5 కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్నాడట సాజిద్. కిక్కు కోసం సినిమాల్లో హీరో రకరకాల ఫీట్లు చేయడం చూసి ఆశ్చర్య పోతున్న ప్రేక్షకులు దర్శక నిర్మాత సాజిద్ నడియా వాలా కిక్కు కోసం రూ. కోటిన్నర ఖర్చు పెట్టడం చూసి నోరెల్లబెడుతున్నారు.

ఇక సినిమా వివరాల్లోకి వెళితే, హిందీ 'కిక్' సినిమాలో సల్మాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా నటించారు. ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి వారంలోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల కలెక్షన్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే తెలుగులో రవితేజప 'కిక్' చూసిన వారు మాత్రం.....సల్మాన్ 'కిక్' కంటే రవితేజ 'కిక్' బాగుందని అంటున్నారు.

English summary
Sajid has done it again through his directorial debut Kick starring Salman and Jacqueline Fernandez. He has apparently paid a whopping 1.5 Cr for this Divya Bharti's song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu