For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్ మండిపాటుపై 'సాక్షి' పేపరులో...

  By Srikanya
  |

  హైదరాబాద్ : సోమవారం సాయింత్రం జరిగిన నాయక్ ఆడియో పంక్షన్ లో ...రామ్ చరణ్ మీడియాపై ఇండైరక్ట్ గా అస్త్రాలు సంధించారు. మా కుటుంబం గురించి, మా బంధాల గురించి పెడర్థాలు తీసే విధంగా ఆ చానల్ ప్రసారం చేసినవి, ఆ పేపర్ రాసినవి నా వెంట్రుకతో సమానం' అని విమర్శలు సంధించారు. పేరు చెప్పకపోయినా అది సాక్షి ఛానెల్ గురించే అని అందరూ అనుకున్నారు. ఈ నేపధ్యంలో సాక్షి పేపరు సైతం...కొంచెం ఘాటుగానే స్పందించింది. ఈ విషయమై..సాక్షి లో...'చిరుత'నయుడి నోటి దురుసు! అనే హెడ్డింగ్ తో ఆర్టికల్ ప్రచురించింది. అందులో రామ్ చరణ్ కి కొంచెం సుద్దులు కూడా చెప్పింది.

  సాక్షి పేపరు మంగళవారం(18/12/2012) ఎడిషన్ లో వచ్చింది యాధాతధంగా...

  " సాధారణ నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి మాటతీరు.. ఎదిగిన కొద్ది ఒదిగే ప్రవర్తన ఆయనను . మెగాస్టార్ హోదాను సంపాదించుకునేలా చేసింది (రాజకీయాల్లో కాదులే). అయితే ఆయన వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రాం చరణ్ తేజ సినిమా అనుభవం ఐదు చిత్రాలే.. అయితే చెర్రీ (చరణ్) వయస్సు ప్రభావమో.. లేక అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మూలంగానో సోమవారం హైదరాబాద్ లో జరిగిన 'నాయక్' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో కొంచెం అతిగా మాట్లాడటం కొంత వివాదానికి చోటిచ్చింది.

  ప్రస్తుతం 'జంజీర్' చిత్రంలో రామ్‌చరణ్ యాంగ్రీ మాన్ పాత్ర పోషించడం కారణంగానో ఏమో.. తెరపైనే కాదు 'నాయక్' ఆడియో ఆవిష్కరణ వేడుకలో కూడా చరణ్ ఆ విధంగానే కనిపించారు. పేరు చెప్పకుండా ఒక టీవీ చానల్, పేపర్‌ను టార్గెట్ చేసి, దూషించారు. చాలా సాదాసీదాగా ప్రసంగాన్ని ప్రారంభించిన చరణ్ .. కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు.

  జీవితమంటే నున్నటి బాటపై బెంజ్ కార్లలో ప్రయాణించడమంత సులభం కాదనే విషయం అప్పుడే అర్ధం కాదు అని చరణ్ వ్యాఖ్యలపై పలువురు వ్యాఖ్యానించారు. చిరంజీవి సినీ జీవితాన్ని దగ్గరగా చూసిన చరణ్.. జీవితమంటే ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని గ్రహించ లేకపోవడం తప్పేనంటున్నారు. చిన్న చిన్న విషయాలకు అతిగా నోరుపారేసుకోకుండా ఉండటం అనేది చరణ్ కు కాలం, అనుభవం నేర్పుతుందేమో చూడాల్సిందే. చరణ్ లాంటి నవతరం హీరోలను మీడియా ఆకాశానికి ఎత్తకపోతే గింజుకుంటారనేది కాదనలేని వాస్తవం. 'మీడియా మీ గురించి మాట్లాడటం ఆపేస్తే.. ఏమవుతుందో ఊహించుకోండి' అంటూ కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో బాబాయి పవన్ కళ్యాణ్ కొట్టిన డైలాగ్స్ ను చరణ్ ఓ సారి గుర్తు చేసుకుంటే మంచిదని సినీ విమర్శకులు అంటున్నారు. సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ప్రయాణించాల్సిన వారు ఆదిలోనే తప్పటడుగులు వేయడం ఎవరూ హర్షించరనే విషయాన్ని చరణ్ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అంటూ రాసుకొచ్చింది.

  English summary
  
 Ramchran said, "As a family, we are very much united and share a great bond. Due to his personal commitments, he could not attend my filmy functions in the past. But that does not mean we are separated." He added, "A news paper or a TV channel cannot separate us."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X