»   » సల్మాన్ ఖాన్ కు ఛాతీనొప్పి.. హాస్పటల్ కి తరలింపు

సల్మాన్ ఖాన్ కు ఛాతీనొప్పి.. హాస్పటల్ కి తరలింపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ఛాతీ నొప్పి రావడంతో ఆయనను ముంబైలోని సైఫి ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఆంజియోగ్రామ్ చేసి సమస్య ఏమిటనేది గుర్తిస్తారని తెలుస్తోంది. రోజులో ఎక్కువ భాగం ఫిటెనెస్ కి కేటయించే సల్లుభాయి కి ఇలా ఛాతి నెప్పి రావటం అందరినీ అశ్చర్యంలో ముంచేసింది. పగలు షూటింగ్ లతో ఖాళి దొరకకపోతే రాత్రి రెండు గంటలకు అయినా జిమ్ లో వర్కవుట్స్ చేసి నిద్రపోతానని చెప్తూంటాడు. అలాంటి సల్మాన్ ఖాన్ అనారోగ్యం వార్త బాలీవుడ్ లో తీవ్ర కలవరం కలిగించింది. అయితే ఆయనకు ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెబుతున్నారు. అతని ఫిటెనెస్ ట్రైనర్ సల్మాన్ ఖాన్ పరిస్ధితిని చూసి ఆశ్చర్యపోతున్నాడు. రోజుకు వెయ్యినుంచి రెండు వేలు కూడా సిట్ అప్స్ చేస్తాడని, అది పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ కు కూడా అసాధ్యమని అంటున్నాడు. అంతేగాక ఆహార విషయంలో కూడా సల్మాన్ చాలా జాగ్తర్తలు తీసుకుంటాడు. ఎక్కువ కూరగాయలు, పళ్ళు మీద ఆధారపడతాడు. అలాగే సుగర్ కంటెంట్ ఉన్న ఆహారపదార్ధాలను ఎప్పుడో ఎవాయిడ్ చేసాడు. ఇక ఆయన ఆరోగ్య పరిస్ధితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

English summary
Bollywood super star Salman Khan admitted saifee hospital.now he underwent angiosperm for his chest pain. After taking all the tests and procedures then only they can justify whats his actual problem.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu