»   »  సల్మాన్‌కు షాక్.. అయ్యా నీతులు చెప్పేది మీరా.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు..

సల్మాన్‌కు షాక్.. అయ్యా నీతులు చెప్పేది మీరా.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రోడ్డు భద్రత, సురక్షితమైన డ్రైవింగ్ గురించి ఎవరు చెప్పినా వినాల్సిందే. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చెపితే.. సీన్ సితార్ అవుతుందనే తాజాగా స్పష్టమైంది. రోడ్డు భద్రత గురించి యువతకు సోషల్ మీడియాలో పాఠాలు చెప్పడానికి ప్రయత్నించిన బాలీవుడ్ కండలవీరుడు అభాసుపాలయ్యాడు. సల్మాన్ నీతులు బోధించడాన్ని జీర్ణించుకోలేని నెటిజన్లు ఆయన తీరును చింపి చాటచేశారు. ట్విట్టర్‌లో సల్మాన్‌కు వ్యతిరేకంగా భారీ యుద్ధమే జరిగింది. అందేంటో మీరే చూడండి..

రోడ్డు మీద జాగ్రత్తగా ఉండండి..

రోడ్డు మీద జాగ్రత్తగా ఉండండి..

తాను నిర్వహించే బీయింగ్ హ్యూమన్ స్వచ్ఛంద సంస్థ తరఫున సల్మాన్ ఖాన్ ఈ-సైకిళ్లను గత సోమవారం ఆవిష్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. సైకిళ్ల వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. కానీ మోటర్ సైకిళ్లే చాలా ప్రమాదం. యువకులు అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు పాదాచారులను దృష్టిలో పెట్టుకోవాలి. ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లు జరిపేటప్పుడు కొందరు యువకులు మితిమీరిన వేగంతో మోటార్ సైకిళ్లను నడపటం చూస్తుంటాను అని సల్మాన్ పేర్కొన్నారు.

సల్మాన్‌పై హిట్ అండ్ రన్ కేసు..

సల్మాన్‌పై హిట్ అండ్ రన్ కేసు..

అలా రోడ్డు భద్రత గురించి ఉపన్యాసం దంచిన సల్మాన్ చూసి నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ఎందుకంటే 2002 సంవత్సరంలో హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌పై కేసు నమోదైంది. ఆ ఘటనలో మద్యం తాగి సల్మాన్ కారును వేగంగా నడిపాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఘటనలో రోడ్డు పక్కన పుట్‌పాట్ పడుకొన్న వారిపై వాహనం దూసుకెళ్లడంతో ఒకరు మరణించడం, మరో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్ ఇటీవల నిర్ధోషిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది.

సల్లూభాయ్‌కి మాయని మచ్చ

సల్లూభాయ్‌కి మాయని మచ్చ

అయితే సల్మాన్ నిర్ధోషిగా కేసు నుంచి విముక్తుడైనప్పటికీ.. ఆయనపై పడిన మచ్చ తొలిగిపోలేదు. ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని తాజాగా నెటిజన్లు సల్మాన్ ఖాన్ దుమ్ము దులిపేశారు. రోడ్డు, భద్రత, మితి మీరిన వేగం గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

విజయ్ మల్యా లాగానే..

విజయ్ మల్యా లాగానే..

రోడ్డు భద్రత గురించి సల్మాన్ చెప్పడం ఎలా ఉంటుందంటే.. బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడిన విజయ్ మల్యా అప్పులను ఎలా చెల్లించాలి అనే విషయంపై లెక్చర్ ఇచ్చినట్టు ఉంటుంది అని శ్రీపర్ణ మజుందార్ అనే యువతి ఘాటుగా స్పందించారు. మితీమిరిన వేగం, రోడ్డుపై జాగ్రత్తలు సల్మాన్ ఖాన్ చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించనట్టే అని మరో వ్యక్తి సెటైర్ విసిరారు. అంతేకాకుండా దుర్భాషలాడే జాకీ ష్రాఫ్ నీతులు బోధించినట్టు ఉంటుందని అన్నారు.

English summary
Twitter is unwilling to let Salman Khan forget that he was once an accused in a hit-and-run case. Salman Khan warned youngsters about the consequences of recklessly speeding and advocated safe driving recently. But youth trolled Salman Khan in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu