»   » శభాష్ :ఊళ్లో అందరికీ టీవీలు పంచిన సూపర్ స్టార్

శభాష్ :ఊళ్లో అందరికీ టీవీలు పంచిన సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఇతరులకు సాయపడే విషయంలో ఎప్పుడూ ముందే ఉండే సల్మాన్ ఖాన్ తను స్థాపించిన 'బీయింగ్‌ హ్యూమన్‌' సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన ఊహించని సాయింతో వార్తల్లోకి ఎక్కారు. ఆయన కశ్మీర్‌లోని కొంతమందికి టీవీ సెట్లు పంపిణీ చేశాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సల్మాన్‌ తాజా చిత్రం 'బజరంగీ భాయిజాన్‌' చిత్రీకరణ కశ్మీర్‌లోని పహల్గమ్‌ ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఆ చుట్టు పక్కల ప్రజలు ఎంతో ఆసక్తిగా షూటింగ్‌ చూడటానికి వచ్చారు. అక్కడివారికి బాలీవుడ్‌ చిత్రాలంటే ఎంతో ఇష్టమైనా చూడటానికి అక్కడ థియేటర్లు లేవు. కనీసం వాళ్లు బుల్లితెరలో అయినా సినిమాలు చూడాలనుకున్నాడు సల్మాన్‌.

అక్కడి ప్రజలతో మాట్లాడి టీవీలు కొనుగోలు చేసే స్తోమత లేని వారి కోసం వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించుకొన్నాడు సల్మాన్‌. ఇప్పటికే కొంతమందికి టీవీలను అందజేశారు. ఈ విషయమై నేషనల్ మీడియా ఆయన్ని మెచ్చుకుంటోంది. సల్మాన్ లోని మరో యాంగిల్ ని ఆవిష్కరించుకున్నాడని చెప్తోంది.

Salman Khan

సల్మాన్ తాజా సినిమా ‘భజ్రంగి భాయిజాన్' విషయానికి వస్తే...

బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. అభిమానులు ఆయన తాజా సినిమా ‘భజ్రంగి భాయిజాన్' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రంజాన్ కానుకగా జులై 17న సినిమా విడుదల కానుంది. తాజా ఈ చిత్రం అపీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీస్ సిద్ధికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి విందులా ఈ చిత్రం ఉండబోతోంది.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్... పవన్ కుమార్ చతర్వేది పాత్రలో హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నారు. అందరూ అతన్ని బజ్రింగి అని పిలుస్తుంటారు. చెవిటి మూగ అయిన పాకిస్థాన్ చిన్నారిని కలుస్తాడు. సినిమా ఆ చిన్నారి చుట్టూ తిరుగుతుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్లో కరీనా కపూర్ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇందులో ఆమె రాశిక పాత్రలో నటిస్తోంది. మరో పాత్రధారి నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో పాకిస్థాన్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోయే విధంగా ఉన్నాయి.

English summary
Bollywood superstar Salman Khan recently extended his help to families of a town in Kashmir while he was working on his film ‘Bajrangi Bhaijaan’. According to reports, the actor purchased television sets for families that couldn’t afford them.
Please Wait while comments are loading...