twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో సల్మాన్ ఖాన్, 5 ఏళ్లు జైలుకెళ్లే అవకాశం?

    By Bojja Kumar
    |

    ముంబై: సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు ప్రస్తుతం ముంబై హైకోర్టుకు చేరింది. ప్రస్తుతం ఈ కేసు విషయంలో ప్రాసిక్యూషన్, డిపెన్స్ లాయర్ మధ్య వాదనలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్ కు 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

    ఈ కేసు విషయమై గురువారం చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ ప్లీడర్ సందీప్ షిండే మాట్లాడుతూ...‘సల్మాన్ ఖాన్ కేసు విషయంలో క్రెడిబుల్ విట్ నెస్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాం. సంఘటన జరిగిన రోజు రాత్రి సల్మాన్ ఖాన్ జెడబ్ల్యు మారియట్ హోటల్ కి వెళ్లే ముందు రెయిన్ బార్ అండ్ రెస్టారెంటులో మద్యం సేవించాడు. అక్కడి నుండి తిరిగి వస్తూ తాను నడుపుతున్న కారును ఎ1 బేకరీ వద్ద యాక్సిడెంట్ చేసాడు' అని తెలిపారు.

    ఆల్రెడీ సెషన్స్ కోర్టులో సల్మాన్ ఖాన్ నేరం రుజువైంది. ఐదేళ్ల జైలు శిక్ష పడింది. దీనిపై సల్మాన్ బాంబే హైకోర్టుకు అప్పీల్ చేసాడు. అయితే వెంటనే అతనికి బెయిల్ లభించింది. సెషన్స్ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు సమర్థిస్తే సల్మాన్ ఖాన్ ఐదేళ్ల పాటు జైలు కెళ్లడం ఖాయం అంటున్నారు.

    Salman Khan In Deep Trouble! May Be Sent To Jail For 5 Years!

    వివిధ నేరాల్లో జైలుకెళ్లిన సినీతారలు...(ఫోటో ఫీచర్)వివిధ నేరాల్లో జైలుకెళ్లిన సినీతారలు...(ఫోటో ఫీచర్)

    గతంలో సెన్స్ కోర్టు తీర్పు ఇలా...

    ఈ కేసులో అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి డి.డబ్ల్యు దేశ్ పాండే తీర్పు మే 6, 2015న వెలువరించారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేనందు మరో రెండు నెలలు జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించారు. జడ్జి తీర్పు వెలువరించే సమయంలో సల్మాన్ ఖాన్ మొహంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ లేదు. తలదించుకుని ఉన్నారు.

    కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవర్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది. ఆ సమయంలో సల్మాన్ కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది. సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టుకు అప్పీల్ చేయడంతో లక్కీగా బెయిల్ దొరికింది. ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది.

    English summary
    Salman Khan's hit and run case reached Bombay High Court where currently the prosecution and defence lawyers are arguing their respective case. In the sessions court, Salman had been sentenced to 5 years in jail when he was convicted for culpable homicide not amounting to murder and several other offences.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X