»   » 10 కోట్ల గిఫ్ట్ పై నోరువిప్పిన బిపాసా: ఇస్తే మాత్రం నేనెలా తీసుకుంటాను ? అంటూ ఎదురు ప్రశ్న

10 కోట్ల గిఫ్ట్ పై నోరువిప్పిన బిపాసా: ఇస్తే మాత్రం నేనెలా తీసుకుంటాను ? అంటూ ఎదురు ప్రశ్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

డస్క్ బ్యూటీ బిపాసా బసు కరణ్ సింగ్ గ్రోవర్ ని పెళ్లి చేసుకుని మహా సంతోషంగా ఉంది ఈ హీరోయిన్. సైలెంట్ గా సన్నిహితుల మధ్యే ఏప్రిల్ నెలాఖర్లో పెళ్లి చేసుకున్న బిపాషా బసు,

మే మొదటి వారంలో మాత్రం గ్రాండ్ పార్టీ ఇచ్చింది. అయితే తన పెళ్ళి అయిన దగ్గరినుంచీ ఏదో ఒక సందర్భంలో మీడియాలో వస్తున్న వార్తలు, ఈ హాట్ బ్యూటీని హర్ట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా బిపాషా, కరణ్ సింగ్ గ్రోవర్ ల పెళ్లి సందర్భంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఓ కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చాడన్న వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది

bipasha

బిపాషా స్నేహితుడు - బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఓ పది కోట్ల రూపయల విలువ చేసే ఇంటిని. బిపాషా బసు మ్యారేజ్ సందర్భంగా సల్మాన్ గిఫ్ట్ గా ఇచ్చాడనే న్యూస్ హల్ చల్ చేస్తోంది. అందరూ ఈ పదికోట్ల గిఫ్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడీ వార్తలపై బిపాషా స్వయంగా స్పందించింది. సల్మాన్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ పొందానన్న మాటను ఖండించింది బిపాషా. సల్లూ భాయ్ తన మ్యారేజ్ రిసెప్షన్ కు వచ్చాడు గానీ 10 కోట్ల బహుమతి మాత్రం అంతా ఫేక్ అని, ఒక వేల సల్మాన్ ఇచ్చినా అంత కాస్ట్లీ గిఫ్ట్ ఎలా తీసుకుంటాననుకున్నారు అంటూ చిరకు పడింది బిపాషా బసు.

English summary
Bipasha Basu rubbishes rumours of Salman Khan gifting her Rs 10 cr house
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu