»   » హీరోయిన్ కోసం ఇల్లు వెతుకుతున్న సూపర్ స్టార్

హీరోయిన్ కోసం ఇల్లు వెతుకుతున్న సూపర్ స్టార్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హీరోయిన్స్ ఏమి కావాలంటే అది చేయటానికి జీ హుజూర్ అంటూ నిర్మాతలే కాదు హీరోలు లైనులో ఉంటారు. అందులో ఆరితేరిపోయిన వ్యక్తి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. రెడీ,బాడీగార్డ్ సూపర్ హిట్స్ వేడిలో ఉన్న సల్మాన్ ఇప్పుడు తన హీరోయిన్ జరీన్ ఖాన్ కోసం ఇల్లు వెతుకుతున్నాడు. జరీన్‌ ఖాన్‌ ప్రస్తుతం ముంబయి బాంద్రాలో ఓ పెద్ద ఇంటి కోసం వెతుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం చిన్న ఫ్లాట్‌లో ఉంటున్న ఈ ముద్దుగు మ్మ కొత్త ఇంటి కోసం బాలీవుడ్‌ కండలవీరుడైన తన స్నేహితుడు సల్మాన్‌ఖాన్‌ సహాయాన్ని తీసుకుంటోంది. సల్మాన్‌ ఎంతో ఉత్సాహంగా జరీన్‌కు పెద్ద ఫ్లాట్‌ కోసం వెతుకుతున్నాడు.బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌, జరీన్‌ఖాన్‌లు ప్రస్తుతం మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి 'క్యారెక్టర్‌ ఢీలా హై"లో ఎంతో హుషారుగా డ్యాన్సులు చేశారు. తరచుగా పార్టీలు, ఫంక్షన్లకు హాజరవుతూ ఈ జంట మురిపిస్తున్నారు.

  ఇక జరీన్‌ ఖాన్‌ గత కొంతకాలంగా బాంద్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌లో నివసిస్తోంది. ఇది సరిపోకపోవడంతో ఆమె ఇదే ప్రాంతంలో మూడు బెడ్‌రూంల ఫ్లాట్‌ కోసం వెతుకుతోంది. ఇందుకోసం ఆమె సల్మాన్‌ సహాయాన్ని అర్థించింది. తన బడ్జెట్‌కు అనుగుణంగా ఇల్లు ఉండాలని ఆమె కోరుకుంటోంది. జరీన్‌ అడిగిందే ఆలస్యం సల్మాన్‌ మూడు బెడ్‌రూంల ఫ్లాట్‌ కోసం వెతుకులాట ప్రారంభించాడు. కానీ సల్మాన్‌ సహాయం గురించి మాత్రం జరీన్‌ ఎవ్వరికీ చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఇక కొత్త ఫ్లాట్‌ దొరికితే తన తల్లితో కలిసి అందులోకి మారాలని జరీన్‌ భావిస్తోంది. 'మా అపార్ట్‌మెంట్‌ చుట్టూ కొంత ఖాళీ స్థలం ఉండాలని కోరుకుంటున్నాను. చుట్టూ భవనాలు ఉంటే ఒకరింట్లోకి మరొకరు చూడడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది" అని జరీన్‌ పేర్కొంది. ఇటువంటి ఫ్లాట్‌ కోసం జరీన్‌ వెతుకుతోంది. ఇక ఈ అందాల ముద్దుగుమ్మ హిందీచిత్రం 'హౌస్‌ఫుల్‌2"తో పాటు హీరో విక్రమ్‌ సరసన తమిళ చిత్రం 'కర్నీకరన్‌"లో కనిపించనుంది.

  English summary
  Zarine Khan is currently living with her family in Bandra but is looking for a new, bigger house in the same locality. But ask her whether good friend and "Character Dheela Hai" dance partner Salman Khan is helping her in the house hunt, and the actress clams up.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more