»   » సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా ‘అఖిల్’ టీజర్

సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా ‘అఖిల్’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ అక్కినేని హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘అఖిల్' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నేడు ఉదయం 10.30 గంటలకు టీజర్ విడుదల చేస్తామని ఇంతకు ముందు ప్రకటించినప్పటికీ... తాజాగా సమయం మార్చారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు సల్మాన్ ఖాన్, నాగార్జున చేతుల మీదుగా టీజర్ విడుదల కానుంది.

ఈ విషయాన్ని అఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... ‘వన్ అండ్ ఓన్లీ భాయ్, బర్త్ డే బాయ్ మై ఫాదర్ ఈ రోజు సాయంత్ర 6.30 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తారు' అని అఖిల్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Salman Khan and Nagarjuna to release Akhil movie teaser

వివి వినాయక్ దర్శకత్వంలో నిర్మాత నితిన్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను అన్నివిధాలా ది బెస్ట్ అనిపించేలా చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారన్న విషయం ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో స్పష్టమైంది.

‘అఖిల్ ' మూవీ టైటిల్ ట్యాగ్ లైన్ ‘ది పవర్ ఆఫ్ జువా' అంటే అర్థం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. దీనిపై నితిన్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. జువా అంటే సూర్యుడు అనే అర్థం వస్తుందని నితిన్ తెలిపారు. ఆఫ్రికాకు చెందిన స్వాహిలి భాషలో జువా అంటే సూర్యుడు అని అర్థం. పోస్టర్లో అఖిల్ చేతిలో ఉన్నది కూడా సూర్య గోళాన్ని తలపిస్తోంది. ఇక నితిన్ ఇచ్చిన ఈ క్లారిటీ తర్వాత ఆఫ్రికన్ నేపథ్యానికి, సినిమా కథకు ఎలాంటి సంబంధం ఉందనే చర్చ మళ్ళీ కొత్తగా మొదలైంది. సినిమాలో అఖిల్ స్వాహిలి బాష మాట్లాడతారని కొందరంటున్నారు.

ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ నెల 29 ఉదయం 10.30 కు టీజర్ ని విడుదల చేస్తామని అన్నారు. అంటే అఖిల్ తండ్రి నాగార్జున పుట్టిన రోజు కానుకగా టీజర్ ని వదులుతారన్నమాట. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ - ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
"The one and only BHAI(Salman Khan) and the birthday boy my father are releasing my teaser today (29th August) at 6:30 pm. Thank you so my Bhai." Akhil tweeted.
Please Wait while comments are loading...