»   » యాకూబ్‌ నిర్ధోషి అంటూ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

యాకూబ్‌ నిర్ధోషి అంటూ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: యాకూబ్‌ నిర్ధోషి, ఆయన సోదరుడు టైగర్‌ మెమన్‌ అసలు దోషి అని సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా సంచలనంగా నిలిచారు. 1993 ముంబయి పేలుళ్ల కేసులో దోషి యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్షపై బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

యాకూబ్‌ మెమన్‌ని కాకుండా, ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, యాకూబ్‌ మెమన్‌ సోదరుడు టైగర్‌ మెమన్‌ని ఉరి తీయాలని సల్మాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. ముంబయి పేలుళ్లకు కారకుడిగా నేరం రుజువుకావడంతో ఈనెల 30న మెమన్‌కి ఉరిశిక్ష వేయాలని సుప్రీం కోర్టు తీర్పువెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన పుట్టిన రోజు నాడే అధికారులు ఉరిశిక్ష వేయనున్నారు.

ఇప్పటికే గత 20ఏళ్లుగా మెమన్‌ నాగపూర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. నాటి ముంబయి పేలుళ్లలో 250మందికిపైగా మృతిచెందారు. యాకూబ్‌ నిర్ధోషి, ఆయన సోదరుడు టైగర్‌ మెమన్‌ అసలు దోషి అని, అతనికే ఉరిశిక్ష వేయాలంటూ సల్మాన్‌ఖాన్‌ ట్విట్టర్‌లో సంచల వ్యాఖ్యలు చేశారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సల్మాన్ తాజా చిత్రం 'బజరంగీ భాయిజాన్‌' విశేషాలకు వస్తే...

తాను ఇటీవల నటించిన చిత్రం 'భజరంగీ భాయ్‌జాన్‌' చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయమై యూపి గవర్నమెంట్ స్పందించి... 'భజరంగీ భాయ్‌జాన్‌' చిత్రానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే.. తమ సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు అమలుచేయవలసిందిగా సల్మాన్‌ఖాన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ను కలిసి చర్చించారు. దీంతో భజరంగీ భాయ్‌జాన్‌కు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారవర్గాల వెల్లడించాయి.

Salman Khan On Yakub Memom

పాకిస్థాన్‌ బాలికను స్వగ్రామానికి చేర్చేందుకు ఓ భారత యువకుడు ప్రయత్నించిన నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌, కరీనాకపూర్‌ జంటగా నటించారు. ఈ సినిమా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని తాను కోరుకుంటున్నానని, అయితే పన్ను మినహాయింపు ఇస్తే సినిమా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఉపయోగించినట్లే అవుతుందని సల్లుభాయ్‌ పేర్కొన్నారు.

కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటించిన భజరంగీ భాయిజాన్‌ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ పాకిస్థాన్‌ బాలిక తన సొంత ఇంటికి చేరుకునేందుకు ఓ భారతీయుడు సహాయం చేసే నేపథ్యంలో తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని సామాజిక కోణంలో చూడాలని భారత, పాక్‌ ప్రధానులు నరేంద్రమోదీ, నవాజ్‌ షరీఫ్‌లకు సల్మాన్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు.

ఈ చిత్రం గురించి అమీర్ ఖాన్ పొడగ్తల్లో ముంచెత్తారు..భజరంగీ భాయ్‌జాన్‌ను ఆమిర్‌ ముంబయిలో వీక్షించాడు. సల్మాన్‌ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం. అదరగొట్టేశాడంటూ సల్మాన్‌ని ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచేశాడు. ఇప్పటి వరకు సల్మాన్‌ నటించిన సినిమాల్లో భజరంగీ భాయ్‌జాన్‌ ద బెస్ట్‌, మంచి కథ, సంభాషణలు, కబీర్‌ ఖాన్‌ చాలా బాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ ఆమీర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు.

Salman Khan On Yakub Memom

'బజరంగీ భాయిజాన్‌' చూసినవాళ్లలో చాలామంది భావోద్వేగానికి లోనవుతున్నారు. సినిమా పతాక సన్నివేశాల్లో సల్మాన్‌ కంటతడి పెట్టించాడని సామాజిక అనుసంధాన వేదికల్లో రాసుకొస్తున్నారు. కథానాయకుడు ఆమీర్‌ ఖాన్‌ ఇటీవల ముంబయిలో ఈ సినిమా చూసి బయటకొస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు.

ఆ తర్వాత ''సినిమా బాగుంది. ఇప్పటివరకు వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ సినిమాల్లో ఇదే అత్యుత్తమం. సల్మాన్‌ నటన అద్భుతంగా ఉంది. కథ, కథనం, సంభాషణలు చాలా బాగా కుదిరాయి. కబీర్‌ ఖాన్‌ చక్కటి సినిమా తీశాడు. అందరూ చూడదగ్గ సినిమా. చిన్నపాప హర్షాలీ మీ మనసులు దోచుకుంటుంది'' అని ట్వీట్‌ చేశాడు ఆమీర్‌ ఖాన్‌.

'బజరంగీ భాయిజాన్‌' సినిమా వసూళ్ల వేట జోరందుకొంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో సుమారు రూ.63.75 కోట్లు వసూలు చేసింది.

దర్శకుడు మాట్లాడుతూ... ''కొత్త కొత్త ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరపడం అంటే నాకు చాలా ఇష్టం. అనేక ప్రాంతాలు పరిశీలించి ఈ సినిమా కోసం లొకేషన్లు ఎంచుకున్నాను. కొండలు, గుట్టలు, హిమానీనదాలు.. ఇలా చాలా ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. సల్మాన్‌ ఖాన్‌ అయితే మనమిద్దరం ట్రెక్కింగ్‌ చేస్తూ లొకేషన్‌కు వెళ్దాం అనేవారు'' అని చెప్పారు కబీర్‌ ఖాన్‌. భారత్‌- పాక్‌ నేపథ్యంలో సినిమాలు తీయడం ఈయన ప్రత్యేకత.

English summary
Salman Khan Twitted:" N no 1 ever Address him as tiger ever . Does not deserve that at all. Hang that.............. fill in th blanks. been wanting to tweet Tis fr 3 days n was afraid to do so but it involves a man's n family. Don't hang brother hang tha lomdi who ran away"
Please Wait while comments are loading...