»   » ఆమె ప్రేమ దక్కలేదు.. కుక్కకాటు మిగిలింది.. నేనుండగానే ఇద్దరితో డేటింగ్.. సల్మాన్ ఫస్ట్ క్రష్

ఆమె ప్రేమ దక్కలేదు.. కుక్కకాటు మిగిలింది.. నేనుండగానే ఇద్దరితో డేటింగ్.. సల్మాన్ ఫస్ట్ క్రష్

Written By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రేమ కథల గురించి రాస్తే ఓ పుస్తకమే అవుతుంది. తన సినీ జీవిత ప్రయాణంలో ఒక్కో దశలో ఒక్కో ప్రేమ కథ. ఒక్కో ప్రేమ కథ చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. అజర్ మాజీ భార్య సంగీత బిజ్లానీ, ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, ప్రస్తుతం వాంటర్ వరకు ఎన్నో అఫైర్ల మధ్య బందీ అయ్యాడు. ఇవన్నీ సిని జీవితానికి సంబంధించినవి.

Salman Khan opens up about his first crush when he was a 16-year-old!

సినీ నటుడుగా మారకముందు తాను చవిచూసిన తొలి ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలను సల్లూభాయ్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ త్వరలో ప్రసారం కానున్నది. ఇంతకీ సల్మాన్ ఖాన్ తొలి ప్రేమ విశేషాలు ఏమిటంటే..

16 ఏళ్ల వయసులో..

16 ఏళ్ల వయసులో..

అప్పడు నాకు 16 ఏళ్లు. తొలిసారి ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాను. ఆమె అంటే ఇప్పటికి చెప్పలేనంత ఇష్టం. ఆమె నాకు మంచి స్నేహితురాలు. అయితే నన్ను ఎప్పుడు రొమాంటిక్ కోణంలో చూడలేదు. నాలోని ప్రేమను ఆమెకు చెప్పడానికి భయపడ్డాను. ప్రేమ గురించి చెబితే ఎక్కడ దూరం అవుతుందనే కారణంతో వెనకడుగు వేశాను అని సల్మాన్ చెప్పాడు.

నా గుండె పగిలింది..

నా గుండె పగిలింది..

అలా ఆమెను ప్రేమిస్తుండగానే ఆమె ఇతరులతో డేటింగ్ చేయడంతో నా గుండె పగిలింది. వారితో కూడా ఆమె ప్రేమ ఫలించలేదు. నా ఫీలింగ్స్ ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆమె నా ప్రేమను గుర్తిస్తే కచ్చితంగా నా ప్రేమ సక్సెస్ అయ్యేది. కానీ ఆమె నన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు. దాంతో నేను చాలా కుంగిపోయాను అని సల్లూభాయ్ అన్నారు.

చాలా అందగత్తె

చాలా అందగత్తె

ఇప్పటివరకు నాకు నచ్చిన అమ్మాయిలందరి కంటే చాలా అందగత్తె. చాలా మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి. ఎప్పుడు ఆమె వెంట ఓ భయంకరమైన కుక్క ఉండేది. దానిని కంట్రోల్ పెట్టడానికి ఆమెకు సాధ్యమయ్యేది కాదు. ఓ రోజు ఆ కుక్క నన్ను కరిసింది. దాన్ని నేను కొట్టబోయేసరికి ఆమె నాపై గట్టిగా అరిచింది. ఆమెను చూస్తుండగానే కుక్క దాని పని అది కానిచ్చింది.

35 ఏళ్లుగా కలవలేదు..

35 ఏళ్లుగా కలవలేదు..

ఆ అమ్మాయికి, ఆమె పెంచుకొన్న కుక్కకు కూడా నేను నచ్చలేదు. చాలా రోజులు విషాదంలో మునిగిపోయాను. ఇక జీవితంలో కారుచీకట్లే అనే ఆందోళనలో పడ్డాను. ఇప్పటివరకు ఆమె పేరును ఎక్కడ చెప్పలేదు. బహుశా ఆమె సంతోషంగా ఉంటుంది అని అనుకొంటున్నాను. గత 35 ఏండ్లుగా ఆమెను చూడలేదు.

బ్రేకప్స్ మంచే చేస్తాయి..

బ్రేకప్స్ మంచే చేస్తాయి..

లవ్‌లో బ్రేకప్స్ అప్పుడప్పుడు మంచే చేస్తాయి. వ్యక్తిగత సంబంధాల విషయంలో వైఫల్యాలు చాలా తీపిగా ఉంటాయి. 16 ఏళ్లలో కలిగే ప్రేమ చాలా మధురంగా ఉంటుంది. అది సఫలం కాకపోతే మంచిదే. దాని కోసం పాకులాడకు. పొగొట్టుకున్న ప్రేమ కంటే ఇంకా మంచి విషయాలు ఎన్నో ఎదురుపడుతాయి.

జీవితం ముగిసిందని బాధపడొద్దు..

జీవితం ముగిసిందని బాధపడొద్దు..

ప్రేమ వైఫల్యం వల్ల కలిగే దానితో జీవితం ముగిసిందని బాధపడవద్దు. చేదు అనుభవాలను తొందర్లోనే మరిచిపోవాలి. దాంతో జీవితంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది అని సల్మాన్ చెప్పుకొచ్చారు. హానీ చవాన్ అనే బ్లాగర్‌తో తన తొలి ప్రేమ విషయాలను పంచుకొన్నారు.

English summary
Bollywood superstar Salman Khan, in a soon-to be-aired interview, recalled the time he was first smitten by a girl, who was just not into him. “I was 16 and there was this girl I really liked, but I could never muster the courage to tell her that. I was scared she would say no. She dated two of my friends and it didn’t work out with either of them. She was a friend to me, but never liked me romantically. When others dated her, I was heartbroken. Salman told teen blogger Hanee Chavan during a chat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu