»   » పెళ్లి చేసుకోంటే డబ్బులు దండగ.. ప్రేమపై నమ్మకం లేదు.. సల్మాన్

పెళ్లి చేసుకోంటే డబ్బులు దండగ.. ప్రేమపై నమ్మకం లేదు.. సల్మాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టే పనిలో పడిన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బాక్సాఫీస్‌ కలెక్షన్లను కొల్లగొట్టడంపైనే దృష్టిపెట్టాడు. ప్రేమ పెళ్లికి దూరం అంటూ ఉన్నప్పటికీ.. ఇలియా వాంటర్ అఫైర్, కత్రినాతో క్లోజుగా ఉంటున్నాడనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తునే ఉంటాయి. సల్మాన్ అఫైర్ గురించి ఎప్పుడు వార్తలు వినిపించినా అవి సెన్సేషనల్ అవుతుంటాయి. తాజాగా ప్రేమ, పెళ్లిపై సల్మాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ట్యూబ్‌లైట్ రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. పెళ్లి అనేది నా దృష్టిలో డబ్బు దుర్వినియోగం చేయడమే. నాకు ప్రేమపై సరైన నమ్మకం లేదు. విశ్వంలో ప్రేమ అనేది ఉంటుంది అని నేను అనుకొను. ఒకరిపై మరొకరికి ఉండే అవసరాలపైనే ప్రేమ ఆధారపడి ఉంటుంది అని సల్మాన్ ఖాన్ అన్నారు.

 Salman Khan opens up on romance, says he doesn't believe in love

భావోద్వేగాలపైనే దీర్ఘకాల సంబంధాలు ఆధారపడి ఉంటాయి. అవసరాల తీరడంపైనే సుఖ, సంతోషాలు ఆధారపడి ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం విడుదలైన ట్యూబ్‌లైట్ చిత్రం సల్మాన్ కెరీర్‌లోనే అతి దారుణమైన ఫ్లాప్‌గా నిలిచిపోయిందనే మాట వినిపిస్తున్నది.

English summary
Salman Khan says that for him marriage is a waste of money. Salman talked about marriage and his idea of love. He said, "I don't believe in love at all. I don't think there's any reason for the word 'love' to exist.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu