»   » 30 ఏళ్ల తర్వాత సల్మాన్‌తో అందాల తార.. ముదురు వయసులో ముగ్గురు హీరోలతో..

30 ఏళ్ల తర్వాత సల్మాన్‌తో అందాల తార.. ముదురు వయసులో ముగ్గురు హీరోలతో..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Old Actress Rebounces Again... ముదురు వయసులో ముగ్గురు హీరోలతో..

80వ దశకంలో బాలీవుడ్ నటి రేఖ తన అందం, అభినయంతో ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. సీనియర్ నటులతోనే కాకుండా, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలతో కూడా పనిచేసింది. 1988లో బీవీ హో తో ఐసీ అనే చిత్రంలో రేఖతో కలిసి నటించడం ద్వారా సల్మాన్ చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత రేఖతో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.

 సల్మాన్‌తో రేఖ

సల్మాన్‌తో రేఖ

ఐదేళ్ల క్రితం రూపొందిన యమ్లా పగ్లా దీవానా2 తర్వాత ప్రస్తుతం యమ్లా పగ్లా దీవానా: ఫిర్‌ సే అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరోగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రేఖ ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనున్నారు.

 కిషోర్ కుమార్ పాట రీమేక్

కిషోర్ కుమార్ పాట రీమేక్

యమ్లా పగ్లా దీవానా: ఫిర్‌ సే చిత్రంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కిషోర్ కుమార్ పాట రఫ్తా రఫ్తా దేఖో.. ఆంఖ్ మేరి లడి హై అనే పాటను రీమేక్ చేయనున్నారు. ఈ పాటను గతంలో ధర్మేంద్ర, రేఖపై చిత్రీకరించిన సంగతి తెలిసిందే.

 ధర్మేంద్రతో మళ్లీ స్టెప్పులు

ధర్మేంద్రతో మళ్లీ స్టెప్పులు

యమ్లా పగ్లా దీవానా: ఫిర్‌ సే చిత్రంలో అతిథి పాత్రలో కనిపించడానికి రేఖ ఒప్పుకొన్నారు. ధర్మేంద్రతో కలిసి మళ్లీ స్టెప్పులు వేసింది. ఆ పాటను ఇటీవల షూట్ చేశాం. ఆ చిత్రంలో అదే మేజర్ హైలెట్‌ అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

 స్పెషల్ సాంగ్‌లో సోనాక్షి సిన్హా

స్పెషల్ సాంగ్‌లో సోనాక్షి సిన్హా

యమ్లా పగ్లా దీవానా: ఫిర్‌ సే చిత్రంలో అలనాటి సూపర్‌స్టార్ శతృఘ్న సిన్హా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ధర్మేంద్ర, సల్మాన్, శతృఘ్నతో కలిసి స్టెప్పులతో అలరించున్నారు రేఖ. ఇక చిత్రంలో శతృఘ్న సిన్హా కూతురు, స్టార్ హీరోయిన్ సోనాక్షి కూడా ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు.

English summary
Salman Khan shared screen space with Rekha in the 1988 film Biwi Ho Toh Aisi. And 30 years after his debut, the 52-year-old actor will reunite with Bollywood's evergreen diva on the big screen in Yamla Pagla Deewana: Phir Se. Five years after Yamla Pagla Deewana 2, the Deols are back with another comedy, and this time, they have roped in Salman and Rekha for a special number in the song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu