సల్మాన్ ఖాన్‌కు సుప్రీం కోర్టులో ఊరట
1998లో హమ్ సాథ్ సాథ్ హై సిన్మా షూటింగ్ కోసం.. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలీ బింద్రే రాజస్థాన్ వెళ్లారు. ఆ సమయంలో షూటింగ్ స్పాట్ కి దగ్గర్లో ఓ జింక తూపాకీ తూటాలకు బలైంది. దీనికి కారణం సల్మాన్ అండ్ కో అనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సల్లూ భాయే జింకను కాల్చి చంపాడని అభియోగాలు నమోదయ్యాయి.
నిందితులపై ఐపీసీ సెక్షన్ 149తో పాటు.. సెక్షన్ 51 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఏళ్ల తరబడి విచారణ కొనసాగింది. అయితే సల్మాన్ నేరానికి పాల్పడ్డట్లు బలమైన సాక్ష్యాలు ఏమీ లేక పోవడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. సల్మాన్ కు ఊరట లభించడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే...ఇటీవలే దబాంగ్ 2 చిత్రంతో హిట్ కొట్టిన సల్మాన్ ఈ సంవత్సరం రాధె, కిక్, నో ఎంట్రీ మెయిన్ ఎంట్రీ అనే సినిమాలు చేయబోతున్నాడు. రాధె చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. మిగిలిన రెండు చిత్రాలు జూన్ నెలలో ప్రారంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications












