»   » ఇండియన్‌ ట్రెండింగ్స్‌లోకి ఈ సాంగ్ (వీడియో)

ఇండియన్‌ ట్రెండింగ్స్‌లోకి ఈ సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు జంటగా నటించిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రంలోని ఓ కొత్త పాట విడుదలైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... వీడియో లింక్‌ను పోస్ట్‌ చేశారు.

ఈ పాట ప్రస్తుతం ట్విట్టర్‌ ఇండియన్‌ ట్రెండింగ్స్‌లో మొదటి పది స్థానాల్లో చోటు సంపాదించింది. సూరజ్‌ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం తెలుగులో 'ప్రేమ లీల' అనే టైటిల్‌తో విడుదల అవుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క ... నవంబర్‌ 12న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో సల్మాన్‌, సోనమ్‌లు నొయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని సల్మాన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

తమను ఎంతో ఆప్యాయంగా పలకరించిన విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సూరజ్‌ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'ప్రేమ లీల' టైటిల్‌తో విడుదల కానుంది.

 Salman Khan’s Aaj Unse Milna Hai VIDEO Song

మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ హై కౌన్ చిత్రాలను భారతీయులు ఎప్పటికి మరిచిపోలేరు. ఆ చిత్రాల్లో ప్రేమ్ గా సల్మాన్ అందరి మనస్సులో గుర్తుండిపోయేలా లవ్ లీగా చేసేసి భారతావనని తన ప్రేమ కథలతో ఊపేసాడు. అయితే ఆ చిత్ర దర్శకుడుతో ఆయన మళ్లీ చిత్రం చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది.

బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా సూరజ్‌ బర్‌జాత్యా దర్శకత్వంలో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

గతంలో సల్మాన్‌ఖాన్‌తో దర్శకుడు సూరజ్‌ బర్‌జాత్యా మైనే ప్యార్ కియా, హమ్ సాత్ సాత్ హై,హమ్ ఆప్ కే కౌన్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తీశాడు. ఈ కాంబినేషన్ తాజాగా నాలుగోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

English summary
Prem Ratan Dhan Payo is an upcoming Indian family drama film, written and directed by Sooraj Barjatya, produced by Rajshri Productions and distributed by Fox Star Studios. It sars Salman Khan and Sonam Kapoor in lead roles. This will be the fourth collaboration between Sooraj R. Barjatya and Salman Khan after their previous blockbusters Maine Pyar Kiya, HAHK and Hum Saath Saath Hain. The film is scheduled to release on 12 November 2015.
Please Wait while comments are loading...