»   » సల్మాన్‌ ఖాన్ గీసిన చిత్రం ఇదిగో...

సల్మాన్‌ ఖాన్ గీసిన చిత్రం ఇదిగో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

దరాబాద్ : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌లో మంచి నటుడే కాదు.. మంచి ఆర్టిస్టూ ఉన్నాడు. . కాస్తంత ఖాళీ సమయం దొరికితే చాలు... కుంచె చేతపట్టి కేన్వాస్‌పై అందమైన చిత్రాల్ని ఆవిష్కరిస్తుంటాడు. ఆ చిత్రాల్ని అప్పుడప్పుడు తన అభిమానులతో ట్విట్టర్‌ ద్వారా పంచుకొంటుంటాడు. తాజాగా, ఆయన ఓ బొమ్మ గీశారు. ప్రేమ మైకంలో ఉన్న అందమైన జంట బొమ్మ అది.
ట్విట్టర్‌లోనే సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని కూడా విడుదల చేశాడు సల్మాన్‌. మీరూ ఆ పెయింటింగ్ ను చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎర్రటి బొట్టు పెట్టుకొన్న ఓ మహిళ, ఆమె వెనక ఓ పురుషుడితో కూడిన ఆ పెయింటింగ్‌ సల్మాన్‌ఖాన్‌నీ, హీరోయిన్ కరీనాకపూర్‌నీ పోలి వుంది. 'బజరంగీ భాయీజాన్‌'అనే శీర్షికతో సల్మాన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఆ పెయింటింగ్‌ అభిమానులకు భలే నచ్చింది. కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న 'బజరంగీ భాయీజాన్‌'లో సల్మాన్‌, కరీనా జంటగా నటించారు. ఈ బొమ్మను చూసినవాళ్లు 'సల్మాన్ ఎంత మంచి చిత్రకారుడో' అని అభినందించకుండా ఉండలేకపోయారు. 

Salman Khan’s 'Bajrangi Bhaijaan' now a painting

అలాగే కొద్ది రోజుల క్రిందట ...ట్విట్టర్స్ లో తన ఫాలోవర్స్, అభిమానులపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిరు కోపం వెళ్లబుచ్చారు. వారి ప్రవర్తనపై తనకు కూసింత అసహనంగా ఉందని చెప్పారు. అలాగే చేస్తే ట్విట్టర్ ను వదిలేస్తారని చెప్పారు.

ఇంతకీ సల్మాన్ కు అసలు కోపం ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. మరేం లేదు మరో అగ్ర హీరోలు షారుఖ్ ఖాన్, అమిర్ ఖాన్ కు వ్యతిరేకంగా సల్మాన్ అభిమానులు పోస్టింగ్ లు చేస్తున్నారట. అది వారిని ఇబ్బంది పెట్టేలా ఉండటంతో అలా చేయకూడదని ఇదివరకే చెప్పిన సల్మాన్ చివరికి అభిమానుల తీరు మారకపోవడంతో కోపగించుకున్నారు.

తాము ముగ్గురం మంచి స్నేహితులమని, ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ ఉండదని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటిస్తూ ఒకరికొకరం హీరోలుగా వెలుగొందుతున్నాం. అందరికీ ప్రేమను స్నేహాన్ని పంచాలనే ఉద్దేశంతోనే ట్విట్టర్ లోకి వచ్చాను. కానీ, డై హార్డ్ ఫ్యాన్స్ వల్ల ఇబ్బంది కలుగుతోంది. ఇంకోసారి వారిలాగే చేస్తే కచ్చితంగా ట్విట్టర్ ను వదిలేస్తాను' అని ఆయన చెప్పారు. సల్మాన్ ఖాన్ కు ట్విట్టర్లో దాదాపు 12.3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

English summary
Salman Khan's love for the canvas is well-known and when he posted a painting, a rendering of his and Kareena Kapoor Khan's characters from Bajrangi Bhaijaan, we couldn't help but wonder if the superstar himself has painted it.
Please Wait while comments are loading...