»   » స్టార్ హీరో గారి బాడీగార్డ్ ని పొగరా? రెచ్చిపోయి తుపాకి గురి పెట్టి దాడి...పోలీస్ కేసు,పరారి

స్టార్ హీరో గారి బాడీగార్డ్ ని పొగరా? రెచ్చిపోయి తుపాకి గురి పెట్టి దాడి...పోలీస్ కేసు,పరారి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: స్టార్ హీరో గారికి ఎంత క్రేజ్ ఉంటుందో...ఆయన వ్యక్తిగత బాడీగార్డ్ లకు, టీమ్ కు అంతకు మించి ఉన్నట్లుగా ఫీలవుతూంటారని దర్శక,నిర్మాతలు అప్పుడప్పుడూ వాపోతూంటారు. ఎందుకంటే హీరోకి దగ్గరకి మసిలేది వాళ్లు. దాంతో తమ యజమానితో పాటు తమకూ ఆ స్దాయి ఉందన్నట్లుగా బిహేవ్ చేస్తూ చాలా సార్లు సమస్యల్లో ఇరుక్కుంటూంటారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ ది అదే సమస్య వచ్చి పడింది.

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్‌ ఖాన్‌ బాడీగార్డ్‌ షేరా వీరంగం వేశాడు. ముంబై అంధేరిలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గొడవలో ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు షేరాపై కేసు నమోదు చేశారు.

ఓ పబ్ వద్ద ఓ వ్యక్తిని తుపాకితో బెదిరించి, గాయపరిచాడు. ఈ వివాదంలో అతని భుజం దగ్గర ఎముక సైతం విరిగిపోయిందని తెలుస్తోంది. ముంబై డీఎన్‌ నగర్‌ ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత 2.00 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Salman Khan's Bodyguard Shera Attacks & Threatens A Man At Gunpoint! Faces Assault Charges

షేరా, ఫిర్యాదిదారు పరస్పరం తిట్టుకున్న తర్వాత జరిగిన గొడవలో షేరా అతనిపై విరుచుకుపడ్డాడు. 'గొడవ ఎందుకు జరిగింది అన్నది కచ్చితంగా తెలియరాలేదు. కానీ ఓ వ్యక్తి వచ్చి షేరాకు ఫోన్‌ ఇచ్చాడు. ఫోన్‌లో అతను మాట్లాడుతూ తీవ్రంగా దుర్భాషలు ఆడాడు.

ఫోన్‌ కట్‌ చేసిన తర్వాత తన సమీపంలో ఉన్న వ్యక్తితో షేరా గొడవ పడ్డాడు. ఇద్దరూ తిట్టుకుని... షేరా అతన్ని తుపాకీతో హెచ్చరించాడు. అంతేకాకుండా బేస్‌బ్యాట్‌తో అతనిపై దాడి చేశాడు. దీంతో అతనికి భుజం చేరువలో ఎముక విగిరి తీవ్రగాయమైంది' అని డీఎన్‌ నగర్‌ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్‌ 326, 506 కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న షేరా కోసం గాలిస్తున్నారు.

షేరా గత 18 సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ వద్ద పనిచేస్తున్నారు. ఆయనకి, సల్మాన్ కు మంచి రిలేషన్ ఉంది. సల్మాన్ ఖాన్ చేసిన బాడీ గార్డ్ సినిమాని షేరా కే డెడికేట్ చేసారు. బాడీగార్డ్ ట్రైలర్ లాంచ్ సమయంలోనూ సల్మాన్ అతన్ని స్టేజి మీదకు తీసుకువచ్చి మాట్లాడించారు.

English summary
As shocking as it might seem, it is reported that Salman Khan's bodyguard Shera has attacked and threatened a man at gunpoint after a major scuffle at a pub and that's not it, it's also reported that Shera broke the man's cervical bone during the scuffle.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu