»   » సల్మాన్ కేసు: ఇలా శిక్ష...అలా బెయిల్, సాయంత్రమే బయటకి?

సల్మాన్ కేసు: ఇలా శిక్ష...అలా బెయిల్, సాయంత్రమే బయటకి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకరి మరణానికి, నలుగురు గాయ పడటానికి కారణమై హిట్ అండ్ కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం మధ్నాహ్నం ఒంటిగంట తర్వాత సల్మాన్ ఖాన్ కు శిక్ష ఖరారు చేస్తూ సెన్స్ కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు.

సల్మాన్ ఖాన్‌కు అలా శిక్ష ఖరారైందో లేదో.... ఆయన తరుపు లాయర్లు అంతకంటే స్పీడుగా మధ్యాహ్నం 3 గంటలకు ముంబై హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. సెసన్స్ కోర్టు తీర్పును నిలిపివేయాలని, బెయిల్ ఇవ్వాలని పిటీషన్లో పేర్కొన్నారు. వెంటనే ఇదేరోజు సాయంత్ర 4 గంటలకు కోర్టు విచారణ కూడా ప్రారంభం కాబోతోంది. ఒక వేళ ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తే.....సాయంత్రం 5 గంటల లోపు కోర్టు ఉత్తర్వులు జైలు అధికారులకు అందితే సల్మాన్ ఈరోజు సాయంత్రమే బయటకు రాబోతున్నాడు. లేటయితే మాత్రం ఈ రోజు రాత్రి సల్మాన్ జైలులోనే గడపబోతున్నాడు.

 Salman Khan's lawyers to appeal in High Court

ఈ పరిణామాలు పరిశీలిస్తే....సల్మాన్ ఖాన్ కు శిక్ష పడుతుందని ఆయన తరుపు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు ముందే ఊహించినట్లు స్పష్టమవుతోంది. అందుకే ముందస్తుగా బెయిల్ పిటీషన్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ రోజు సాయంత్రం సల్మాన్ ఖాన్ బెయిల్ తీసుకుని బయటకు రాబోతున్నాడు.

English summary
Bollywood actor Salman Khan on Wednesday was convicted of all the charges against him in the 2002 hit-and-run-case and was sentenced to five years in prison. The judge, while reading the charges against Salman Khan said that at the time of the accident Khan was under the influence of alcohol.
Please Wait while comments are loading...