»   » సుల్తాన్ కి పెద్ద దెబ్బే... ఇంకా షాక్ లోనే సల్మాన్

సుల్తాన్ కి పెద్ద దెబ్బే... ఇంకా షాక్ లోనే సల్మాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పైరసీ ఎన్ని రకాలుగా అడ్డుకుటున్నా ఈ భూతాన్ని తరమతం మాత్రం ఎవరివల్లా కావ్టం లేదు. కోట్లు పెట్టిన సినిమాని కొన్ని గంటల్లోనే కాపీ చేసి నిర్మాతలని ఆర్థికంగా పెద్ద దెబ్బ తీస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి పైరసీ కారణంగా భారీ నష్టాలు జరుగుతున్నాయి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో లీకైపోతున్నాయి.

వివేక్ ఒబరాయ్, రితేష్ దేశ్ ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన గ్రేట్ గ్రాండ్ మస్తీ కూడా రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో వచ్చేసి నిర్మాతలకు నష్టాన్ని తెచ్చి పెట్టింది. ఆ విషయాన్ని మర్చిపోకముందే ఇటీవల బాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఉడ్తా పంజాబ్ రిలీజ్ కు ముందే నెట్ లో దర్శనమిచ్చింది. ఆఖరికి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా సుల్తాన్ కు కూడా ఈ కష్టాలు తప్పలేదు.

ఇంకా ధారుణం ఏమిటంటే అటు థియేటర్ లో విడుదలైన రెండో రోజునే ఏకంగా చెన్నై లోని లోకల్ కేబుల్ చానల్ లో "ఉడ్తా పంజాబ్" ప్రసారం కావటం. హీరో సూర్య ఇది చూసి ట్విట్టర్ లో పెట్టి నిర్మాతలు స్పందించే సరికే సినిమా అయిపోయింది...

Salman Khan's 'Sultan' leaked online?

అయితే ఇప్పుడీ పైరసీ దెబ్బ సల్మాన్ కొత్త చిత్రాన్నీ తాకింది.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కేవలం ఇండియాలోనే ఈ చిత్రం 4500 థియేటర్లలో విడుదలై సరికొత్త రికార్డు సృష్టించింది. అలీ అబ్బాస్ జాఫర్ రూపొందించిన సుల్తాన్ చిత్రంలో అనుష్క శర్మ కథానాయికగా నటిస్తోంది.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తోంది. సుల్తాన్ చిత్రం రిలీజ్ అయి కొన్ని గంటలు కూడా కాకముందే, ఈ చిత్రం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ వెంటనే అప్రమత్తమయి లింకులను డిలీట్ చేసే పనిలో ఉన్నారట. ఈ విశయం తెలిసిన సల్మాన్ పిచ్చి కోపం తో ఊగిపోయాడట. తన అభిమానులైతే సినిమాని థియేటలో తప్ప చూడకండీ అనే ప్రకటన ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడట. ఈ విశయమై ఇప్పటికే నిర్మాతలకు అభయం ఇచ్చాడట సల్మాన్

Salman Khan's 'Sultan' leaked online?

గతంలో మాదిరిగా అన్ని టోరెంట్ సైట్ లలో అందుబాటులో లేకున్నా కొన్ని వెబ్ సైట్స్ నుంచి ఇప్పటికే సుల్తాన్ సినిమాను డౌన్ లోడ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ముంబై సైబర్ క్రైం ఎక్స్ పర్ట్స్ ధృవీకరించారు. ఇప్పటికే నష్ట నివారణా చర్యలు చేపట్టిన చిత్ర యూనిట్ పలు వెబ్ సైట్స్ బ్లాక్ చేయిస్తున్నప్పటికీ.. ఇప్పటికే పర్స్థితి చేయి జారిపోయినట్టుంది... ఈ పాటికే ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో మరెంత మందికి దాన్ని షేర్ చేసారో తెలీదు. ఒక రకంగా కొన్ని కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టే అంటున్నారు బాలీవుడ్ జనం...

English summary
After Anurag Kashyap's 'Udta Punjab' was leaked last month, piracy organisations have allegedly leaked the most awaited movie of the year, Salman Khan-Anushka Sharma-starrer 'Sultan.'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu