For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టైగర్ జిందా హై ఫస్ట్ టాక్.. బ్లాక్‌బస్టర్.. సల్మాన్, కత్రినా ఇరుగదీశారు. నరాలు తెగే ఉత్కంఠ..

  By Rajababu
  |

  ట్యూబ్‌లైట్ లాంటి అట్టర్ ఫ్లాప్ చిత్రం తర్వాత సల్మాన్ ఖాన్, కత్రినా కైప్ నటించిన చిత్రం టైగర్ జిందా హై. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారం (డిసెంబర్ 22న) రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే ఈ చిత్రం ఒకరోజు ముందుగానే యూఏఈలో రిలీజై అద్భుతమైన టాక్‌ను సొంతం చేసుకొన్నది. టైగర్ జిందా హై చిత్రానికి సంబంధించిన రివ్యూలు ఇప్పటికే మీడియాలో వెలుగుచూశాయి.

  సల్మాన్ ఫ్యాన్స్, సినీ అభిమానులు తప్పక చూడాల్సిన చిత్రమనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ చిత్రంలో సల్మాన్ ఎలక్ట్రిఫైయింగ్ ఫెర్మార్మెన్స్‌ను ప్రదర్శించినట్టు సినీ విశ్లేషకుల అభిప్రాయం. కొందరు సినీ విమర్శకుల రివ్యూలు మీ కోసం..

   థ్రిల్లింగ్‌గా టైగర్ జిందా హై

  థ్రిల్లింగ్‌గా టైగర్ జిందా హై

  టైగర్ జిందా హై చిత్రం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. యాక్షన్ సీన్లను సీట్ల అంచున కూర్చొని చూసిన ఫీలింగ్ కలిగింది. సల్మాన్ ఖాన్, యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రానికి అద్భుతమైన ముగింపును ఇచ్చారు. బాలీవుడ్‌లో ఈ ఏడాదికి ఇదే ఫర్‌ఫెక్ట్ బ్లాక్‌బస్టర్. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొంటే అన్ని సినిమాలకు ఇది బాప్ లాంటింది. ఇంతకంటే ఏమి చెప్పలేను అని సినీ విమర్శకుడు నీలమ్ జోషి ట్వీట్ చేశారు.

   పాతబడిన వైన్‌లా సల్మాన్ ఖాన్

  పాతబడిన వైన్‌లా సల్మాన్ ఖాన్

  సల్మాన్ యాక్టింగ్ సూపర్‌గా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ఓ సామెత గుర్తొంచ్చింది. వైన్ పాతబడిన కొద్ది చాలా అద్భుతంగా ఉంటుంది. సల్మాన్ దూకుడు, ప్రత్యర్థులను చిత్తు చేసే ఆత్మవిశ్వాసం, భయంకరమైన యాక్షన్ సీన్లు నివ్వెరపాటుకు గురిచేస్తాయి. సల్మాన్ అర్ధనగ్నంగా కనిపించి ఫ్యాన్స్‌ను ఉత్తేజానికి గురిచేస్తాడు అని నీలమ్ జోషి మరో ట్వీట్ చేశారు.

  కత్రినా కైఫ్ ఇరుగదీసింది..

  కత్రినా కైఫ్ ఇరుగదీసింది..

  జోయా (కత్రినా) టైగర్‌కు కేవలం భార్యనే కాదు. ఓ శక్తిమంతమైన మహిళ. టైగర్ కష్టాల్లో పడిన ప్రతీసారి అతడిని బయటపడేస్తుంది. కీలక సన్నివేశాల్లో కత్రినా తన అభినయంతో ఇరుగదీసింది. సల్మాన్ సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం ఉండదు అనే వారి నోరు మూయించింది అని నీలమ్ జోషి తన రివ్యూలో పేర్కొన్నారు.

  కట్టిపడేసే స్క్రీన్ ప్లే

  కట్టిపడేసే స్క్రీన్ ప్లే

  టైగర్ జిందా హై చిత్రానికి కేవలం కథనే బలం కాదు. కథకు అనుగుణంగా కొన్ని అంశాలు అదనపు బలంగా మారాయి. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా చూస్తే సల్మాన్ వన్ మ్యాన్ షో అనే ఫీలింగ్ కాకుండా టీమ్ వర్క్ అనే భావన కలుగుతుంది

   దిమ్మ తిరిగే డైలాగ్స్

  దిమ్మ తిరిగే డైలాగ్స్

  టైగర్ జిందా చిత్రంలో యాక్షన్ పార్ట్ హైలెట్. దాదాపు 12 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తాయి. స్టైలిస్ యాక్షన్ పార్ట్, దిమ్మతిరిగే డైలాగ్స్ ప్రేక్షకుల మతి పోయేలా చేస్తుంది.

   సల్మాన్, కత్రినా జోడి టెర్రిఫిక్

  సల్మాన్, కత్రినా జోడి టెర్రిఫిక్

  ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉంటుంది. సల్మాన్ ఖాన్ టెర్రిఫిక్‌గా కనిపిస్తారు. కత్రినా కూడా సల్మాన్‌కు ధీటుగా నటించింది. ఈ సినిమా ఓ మిషన్.. ఓ ఆపరేషన్‌లా ఉంటుంది.

   సల్మాన్ ఖాన్ అందంగా

  సల్మాన్ ఖాన్ అందంగా

  టైగర్ జిందా హైలో సల్మాన్ చాలా గ్లామరస్‌గా కనిపించాడు. బ్లేజర్స్, జాకెట్స్, పఠాన్ కుర్తాలు ధరించిన సల్లూభాయ్ సూపర్‌గా ఉన్నాడు. గత చిత్రాల కంటే సల్మాన్ అందంగా కనిపిస్తాడు.

   చివరి సీన్ వరకు ఉత్కంఠగా

  చివరి సీన్ వరకు ఉత్కంఠగా

  టైగర్ జిందా హై చిత్రం ప్రారంభమైన మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఉత్కంఠగా సాగుతుంది. చివరి క్షణం వరకు సీట్లకు అత్తుకుపోయి చూస్తారు. సల్మాన్, కత్రినా ఫెర్ఫార్మెన్స్ బ్రహ్మండంగా ఉంటుంది.

   నాలుగేళ్ల తర్వాత సల్మాన్, కత్రినా

  నాలుగేళ్ల తర్వాత సల్మాన్, కత్రినా

  ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న టైగర్ జిందా హై చిత్రంలో సుమారు నాలుగేళ్ల తర్వాత సల్మాన్, కత్రినా కలిసి నటించారు. ఆ చిత్రంలో కూడా సల్మాన్ ఖాన్ రా ఏజెంట్‌గా, కత్రినా కైఫ్ పాకిస్తానీ ఏజెంట్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథను దర్శకుడు అబ్బాస్ జాఫర్ అలీ మరోస్థాయికి తీసుకెళ్లాడని ఇటీవల కత్రినా కైఫ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

  English summary
  Salman and Katrina will be seen together onscreen after almost four years in Ek Tha Tiger's sequel, Tiger Zinda Hai. Those who have come late, Salman Khan plays the role of a RAW agent in the film while Katrina plays a Pakistani agent. In an interview to a daily, Katrina Kaif revealed that the story of the movie is outstanding, "It's an incredible story I think Ali (Abbas Zafar, the film's director) has taken the story forward in an amazing way. It has been really fun everyday on the set with Ali and Salman. It has been really wonderful.'' Stay tuned for more updates on Tiger Zinda Hai.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X