Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బాహుబలి రికార్డును బ్రేక్ చేయనున్న ట్యూబ్‌లైట్.. సల్మాన్ హవా..
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్‌లైట్ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తున్నది. రంజాన్ పండుగను పురస్కరించుకొని జూన్ 23న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నది. భజ్‌రంగీ భాయ్‌జాన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం విడుదలకు ముందే బాహుబలి రికార్డును అధిగమించనున్నది.

9 వేల థియేటర్లలో బాహుబలి
సంచలన విజయం సాధించిన బాహుబలి2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9 వేల థియేటర్లలో విడుదలైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటంచిన ఈ చిత్రం దేశంలో దాదాపు 6500 స్క్రీన్లలో రిలీజ్ అయింది. అమెరికాలో 1100 స్క్రీన్లు, కెనడాలో 180 స్క్రీన్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

10 వేల థియేటర్లలో ట్యూబ్‌లైట్
అయితే తాజాగా సల్మాన్ ఖాన్ చిత్రం ట్యూబ్‌లైట్‌ను దాదాపు 10 వేల థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో 330 స్క్రీన్లలో, బ్రిటన్‌లో 215 స్క్రీన్లలో రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ స్క్రీన్లలో రిలీజ్ చేసే అంశం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

50 దేశాల్లో సల్మాన్ సినిమా..
ఇదిలా ఉండగా తొలివారమే భారీ కలెక్షన్లను కొల్లగొట్టేందుకు ట్యూబ్‌లైట్ చిత్రాన్ని దాదాపు 50 దేశాల్లో రిలీజ్‌కు చేయనున్నారు. భజ్‌రంగీ భాయ్‌జాన్ చిత్రం తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అద్భుతమైన నటనను సల్మాన్ ఖాన్ ప్రదర్శించాడని, ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకోవడం ఖాయమనే వాదన వినిపిస్తున్నది.

సల్మాన్ సరసన చైనా నటి
దర్శకుడు కబీర్ ఖాన్‌తో సల్మాన్ ఖాన్‌కు ఇది మూడో సినిమా. గతంలో ఏక్ థా టైగర్, భజ్ రంగీ భాయ్‌జాన్ చిత్రానికి కలిసి పనిచేశారు. మూడో ప్రయత్నంగా ట్యూబ్‌లైట్ చిత్రానికి పనిచేశారు. భారత్, చైనాల మధ్య జరిగి యుద్ధం నేపథ్యంగా ఈ చిత్రం రూపుదిద్దుకొన్నది. ఈ చిత్రంలో సల్మాన్ సరసన చైనా నటి జూ జూ నటించింది.