twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్యూబ్‌లైట్‌కు రూ. 20 కోట్లు.. సల్మాన్ చిత్రం రికార్డు

    సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ట్యూబ్‌లైట్ చిత్రం విడుదలకు ముందే బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తున్నది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్‌ రూ.20 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

    By Rajababu
    |

    సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ట్యూబ్‌లైట్ చిత్రం విడుదలకు ముందే బాలీవుడ్‌లో రికార్డులు సృష్టిస్తున్నది. ఇప్పటికే శాటిలైట్స్ రైట్స్ రూ.130 కోట్లకు అమ్ముడుపోయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ రైట్స్‌ రూ.20 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

    మ్యూజిక్ హక్కులు రూ.20 కోట్లు

    మ్యూజిక్ హక్కులు రూ.20 కోట్లు

    కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మ్యూజిక్ హక్కులను సోని మ్యూజిక్ రూ.20 కోట్లు చెల్లించి సొంతం చేసుకొన్నట్టు ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ చిత్రంలో మూడంటే మూడు పాటలు ఉండటం గమనార్హం. కేవలం మూడు పాటలకే రూ.20 కోట్లు చెల్లించి సోని హక్కులు దక్కించుకోవడం చర్చనీయాంశమైంది.

     దిల్ వాలేకు 19 కోట్లు

    దిల్ వాలేకు 19 కోట్లు

    గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ రతన్ ధన్ పాయో చిత్రం మ్యూజిక్ రైట్స్ రూ.17 కోట్లు పలికాయి. షారుఖ్ చిత్రం దిల్‌వాలే మ్యూజిక్ హక్కులు రూ.19 కోట్లకు అమ్ముడుపోయాయి.

     ఇండో, చైనా యుద్దం నేపథ్యంగా

    ఇండో, చైనా యుద్దం నేపథ్యంగా

    ట్యూబ్‌లైట్ చిత్రం పిరియాడిక్ డ్రామాగా రూపుదిద్దుకొంటున్నది. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధ నేపథ్యంగా తెరకెక్కుతున్నది. ఇది పక్కాగా ప్రేమ కథా చిత్రం.

    సల్మాన్‌తో కబీర్ మూడోసారి

    సల్మాన్‌తో కబీర్ మూడోసారి

    ట్యూబ్‌లైట్ చిత్రానికి దర్శకుడు కబీర్ ఖాన్. సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాలకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఏక్ థా టైగర్ రూ.198 కోట్లు, భజరంగీ భాయ్ జాన్ రూ.320 కోట్లు వసూలు చేశాయి.

    బాలీవుడ్‌లోకి చైనా నటి

    బాలీవుడ్‌లోకి చైనా నటి

    ఈ చిత్రంలో చైనా నటి జూజూ, దివంగత ఓంపూరి, మహ్మద్ జీషాన్, సోహైల్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2017 జూన్ 23వ తేదీన విడుదల కానున్నది.

    అతిథి పాత్రలో షారుక్

    అతిథి పాత్రలో షారుక్

    భారత్‌కు చెందిన ఓ యువకుడు, చైనాకు చెందిన యువతి ప్రేమలో పడుతారు. భారత, చైనా యుద్దంలో వారు ఎలాంటి పరిస్థుతులను ఎదుర్కొన్నారనే కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అతిథి పాత్రను పోషిస్తున్నట్టు డైరెక్టర్ కబీర్ ఖాన్ వెల్లడించారు.

    English summary
    Salman’s upcoming film Tubelight, music rights have been sold for a whopping Rs 20 crore.Tuesday that makers of the Kabir Khan directorial sold the music rights for Rs 20 crore to Sony Music. Interestingly, the film only has three songs
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X