»   »  వీడియో: సల్మాన్‌ సాంగ్ కు షారుఖ్‌.. షారుఖ్‌ సాంగ్ కు సల్మాన్‌ డాన్స్

వీడియో: సల్మాన్‌ సాంగ్ కు షారుఖ్‌.. షారుఖ్‌ సాంగ్ కు సల్మాన్‌ డాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : సల్మాన్‌ఖాన్‌, సోనమ్‌కపూర్‌ జంటగా రూపొందిన చిత్రం 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో'(తెలుగులో ప్రేమ లీల). ఈ చిత్ర ప్రచార కార్యక్రమాన్ని ముంబయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ చిత్ర యూనిట్ హాజరై సందడి చేసింది.

Salman Khan and Shah Rukh Khan dance to each other's tunes

ఇందులో భాగంగా షారుఖ్‌ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే(డీడీఎల్‌జే)' చిత్రంలోని ఓ పాటకు ఈ చిత్ర యూనిట్ డాన్స్ చేసింది.


ఈ వీడియోని సల్మాన్‌ఖాన్‌ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. అయితే దీనికి సమాధానంగా షారుఖ్‌ ఖాన్‌ ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో చిత్రంలోని 'ప్రేమ్‌ ధన్‌ పాయో' గీతానికి దిల్‌వాలే చిత్ర యూనిట్ తో కలిసి డాన్స్ చేశారు.

షారుఖ్‌ బృందం నృత్యం చేసిన ఆ వీడియోని షారుఖ్‌ఖాన్‌ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. దీపావళి కానుకగా నవంబర్‌ 12న 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్‌ నటులు షారుక్‌ ఖాన్‌, కాజోల్‌, వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌లు నటించిన చిత్రం దిల్‌వాలే. ఈ సినిమా ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ని అధికారిక ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. డిసెంబరు 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

English summary
Salman Khan and Shah Rukh Khan have been stealing the limelight lately with their budding friendship.
Please Wait while comments are loading...