»   » ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది ...మళ్లీ దేశాన్ని ఊపుతుందా

ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది ...మళ్లీ దేశాన్ని ఊపుతుందా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ హై కౌన్ చిత్రాలను భారతీయులు ఎప్పటికి మరిచిపోలేరు. ఆ చిత్రాల్లో ప్రేమ్ గా సల్మాన్ అందరి మనస్సులో గుర్తుండిపోయేలా లవ్ లీగా చేసేసి భారతావనని తన ప్రేమ కథలతో ఊపేసాడు. అయితే ఆ చిత్ర దర్శకుడుతో ఆయన మళ్లీ చిత్రం చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది.

బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్న 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ విషయాన్ని సల్మాన్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. అదేవిధంగా ఈ చిత్రం ట్రైలర్‌ను అక్టోబర్‌ 1న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

సూరజ్‌ బర్‌జాత్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్‌తోపాటు సోనమ్‌ కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇటీవలే భజరంగీ బాయ్‌జాన్ సినిమా తో సల్లూభాయ్ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ కండల వీరుడు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్టు ప్రేమ్ రతన్ ధన్ పాయో టీజర్ పోస్టర్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేశారు.

Salman Khan shares ‘Prem Ratan Dhan Payo’ teaser poster

అభిమానులు, అనుచరులందరికీ ‘గుడ్ ఆఫ్టన్‌నూన్. వెల్ కమ్ సూరజ్ బర్జత్య ప్రేమ్ ఆగేయిన్..ఈజ్ దివాలీ ప్రేమ్ ఈజ్ బ్యాక్' అంటూ సందేశాన్ని పోస్ట్ చేశారు. సూరజ్‌భర్జత్య దర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్టులో సల్మాన్‌ఖాన్ సరసన సోనమ్ కపూర్ జోడీగా నటిస్తున్నారు.

గతంలో సల్మాన్‌ఖాన్‌తో ఈ దర్శకుడు మైనే ప్యార్ కియా, హమ్ సాత్ సాత్ హై,హమ్ ఆప్ కే కౌన్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తీశాడు. ఈ కాంబినేషన్ తాజాగా నాలుగోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

English summary
Bollywood superstar Salman Khan shared the teaser poster of his much-awaited upcoming movie ‘Prem Ratan Dhan Payo’ directed by Sooraj Barjatya. The caption on the picture aptly read: “Iss Diwali Prem Is Back.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu