»   » మొదటి వారం రూ.165 కోట్లు వసూలు

మొదటి వారం రూ.165 కోట్లు వసూలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌లు జంటగా దీపావళి సందర్భంగా విడుదలైన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం వసూళ్ల మోత మోగిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ చిత్రాల్లో మొదటి వారంలో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన 'బజరంగీ భాయ్‌జాన్‌' తర్వాతి స్థానాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రం దేశవ్యాప్తంగా మొత్తం రూ.165 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

సూరజ్‌ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తొలిరోజే బాక్సాఫీసు వద్ద ఈ హిందీ చిత్రం దాదాపు రూ.40 కోట్ల కలెక్షన్లు సాధించింది.

ఇక సల్మాన్‌ ఖాన్‌, సోనమ్‌ కపూర్‌ జంటగా రూపొందిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' ప్రపంచ వ్యాప్తంగా 5,300 థియేటర్లలో గురువారం విడుదలైంది. భారత్‌లోనే 4,500పైగా థియేటర్లలో, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 800 థియేటర్లలో చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమలీల' పేరుతో విడుదల చేశారు. తెలుగులో సల్మాన్‌ఖాన్‌కు రామ్‌చరణ్‌ డబ్బింగ్‌ విశేషం.

Salman Khan, Sonam Kapoor’s ‘Prem Ratan Dhan Payo’ earns Rs. 165.45 cr

ఈ చిత్రం పాకిస్థాన్‌లోనూ విడుదలైంది. తెలుగులో 'ప్రేమలీల', తమిళంలో 'మెయ్‌ మరన్‌దాయో అన్బే' పేరిట తీసుకొచ్చారు. అమెరికన్‌ రచయిత మార్క్‌ ట్వెయిన్‌ రాసిన 'ది ప్రిన్స్‌ అండ్‌ ది పాపర్‌' కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.

సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‌తో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో'ను తెరకెక్కించారు. విడుదలకు ముందే సంగీతం, శాటిలైట్‌ హక్కుల అమ్మకం ద్వారా రూ.57 కోట్లు ఆదాయం వచ్చింది. హిమేష్‌ రేష్మియా స్వరపరిచిన గీతాలకు మంచి స్పందన వస్తోంది. సంగీతం హక్కుల ద్వారా వచ్చిన ఆదాయంలో ఇప్పటివరకు ఈ చిత్రానిదే రికార్డు.

సల్మాన్‌కు ప్రేమ్‌ పేరుతో అదృష్టం కలిసొచ్చింది. బర్జాత్యాతో చేసిన చిత్రాలతో పాటు కొన్ని ఇతర చిత్రాల్లోనూ సల్మాన్‌ పాత్రకు ప్రేమ్‌ పేరు పెట్టారు. అవి దాదాపు విజయం సాధించాయి. ఇప్పుడు 'ప్రేమ్‌ రతన్‌..'తో సల్మాన్‌ 12వ సారి ప్రేమ్‌గా కనిపించాడు.

English summary
Salman Khan starrer 'Prem Ratan Dhan Payo's collections have gone up to Rs. 165.43 cr in India after the first week of its release.
Please Wait while comments are loading...